Gir Lions: తుపాను సమయంలో మన సింహాలు క్షేమం అంటూ దక్షిణాఫ్రికా సింహాల వీడియో పోస్ట్ .. ఏకిపారేస్తున్న నెటిజన్లు!
Gir Lions: ఈ మధ్య అరేబియా సముద్రంలో అల్లకల్లోలం సృష్టించిన తౌక్టే తుపాను నష్టాలను ఒక్కొటిగా అంచనా వేస్తున్నారు. అధికారులు. తుపాను బారిన పడిన అన్ని రాష్ట్రాల్లోనూ నష్ట అంచనాలు మొదలు పెట్టారు.
Gir Lions: ఈ మధ్య అరేబియా సముద్రంలో అల్లకల్లోలం సృష్టించిన తౌక్టే తుపాను నష్టాలను ఒక్కొటిగా అంచనా వేస్తున్నారు. అధికారులు. తుపాను బారిన పడిన అన్ని రాష్ట్రాల్లోనూ నష్ట అంచనాలు మొదలు పెట్టారు. ప్రజలకు కలిగిన నష్టాలను మదింపు వేసే పనిలో అన్ని శాఖల అధికారులూ ఉన్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. వాటిని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు. అయితే, గుజరాత్ అటవీశాఖ ఇదే ప్రయత్నంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి అభాసు పాలైంది. గుజరాత్ లోని గిర్ లో సింహాల సఫారీ ఉంది. తుపాను వచ్చిపోయిన తరువాత గిర్ సఫారీలోని సింహాల పరిస్థితిని ప్రజలకు తెలియ చేశారు. తుపాను వెళ్ళిన వెంటనే సిబ్బంది గిర్ ప్రాంతంలో సింహాల పరిస్థితి గురించి తెలుసుకున్నారని చెప్పారు. అన్ని సింహాలూ క్షేమంగా ఉన్నాయని ప్రకటించారు. ఇంత వరకూ బాగానే ఉంది. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో కొన్ని సింహాలు రోడ్డుపై వాగు దటుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో అందరూ సింహాలు క్షేమంగా ఉన్నందుకు తమ సంతోషాన్ని వెలుబుచ్చారు. అయితే, ఇక్కడే గుజరాత్ ఫారెస్ట్ అధికారులు తప్పులో కాలేశారు. ముందు గిర్ సింహాల ఈ వీడియో చూడండి..
Lions are completely safe in Gir landscape in the aftermath of #Tauktecyclone. @GujForestDept Field staff has kept constant monitoring on lion movement. A rare video of a Pride in Akolvadi range Gir West crossing a water way safely, being shared.#LionsAreSafe @PMOIndia @CMOGuj pic.twitter.com/T2JAKVhmua
— mayank kanjara (@mayanksoni_1104) May 20, 2021
చూశారుగా.. ఇప్పుడు ఈ వీడియో చూడండి..
View this post on Instagram
ఈ రెండు వీడియోలూ ఒకటే కదా.. ఎందుకు రెండూ చూపించారనేదేగా మీ అనుమానం.. మీరు జాగ్రత్తగా గమనించండి..పై వీడియో మనవాళ్ళు పోస్ట్ చేసింది. కానీ, కింద వీడియో దక్షిణాఫ్రికాలోని మాలా మాలా గేమ్ రిజర్వ్ లోని సింహాల వీడియో. అదండీ సంగతి. మన గిర్ సింహాలు క్షేమంగానే ఉండి ఉండవచ్చు. కానీ, వాళ్ళు షేర్ చేసిన వీడియో మాత్రం దక్షిణాఫ్రికా సింహాల వీడియో. దీంతో అదే సోషల్ మీడియాలో గుజరాత్ అటవీశాఖ చేసిన పనికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అసలు గిర్ సింహాలు అని పోస్ట్ చేసిన వీడియోలో ఉన్నది మన ఆసియన్ సింహాలు కాదు అంటూ స్పష్టంగా ఏకిపారేస్తున్నారు. అసలు మీరు సింహాలు ఎలాగున్నాయో పరిశీలించారా? ఎందుకు ఇలాంటి వీడియోలతో మభ్య పెడతారు? అంటూ కడిగి పారేస్తున్నారు. దీంతో గుజరాత్ అటవీశాఖ దీనికి సంబంధించి మరో పోస్ట్ పెట్టింది. దానిలో మన గిర్ సింహాలు ఉన్న ఫోటోలు ఉన్నాయి. మొత్తమ్మీద కొందరు అధికారులు చూపించిన అత్యుత్సాహం సోషల్ మీడియాలో అభాసుపాలు అయింది. కామెంట్లతో ఆ వీడియోను తొలగించారు. కానీ, అప్పటికే ఆ వీడియోను చాలా మంది చూశారు. అది చూసిన చాలా మంది షేర్ కూడా చేశారు.