జాలర్లకు చిక్కిన ఆ భారీ చేప ధర ఎంతంటే..!

పశ్చిమ బెంగాల్‌లోని డిఘా తీర ప్రాంతంలో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. ఏనుగు చెవుల ఆకారంలో ఉండే ఈ చేప బరువు అక్షరాల 800 కిలోలు. దీని ధర చేపల మార్కెట్లో కిలో రూ. 2,100 చొప్పున దాదాపు రూ. 20 లక్షల పైగానే ఉంటుందంటున్నారు వ్యాపారులు.

జాలర్లకు చిక్కిన ఆ భారీ చేప ధర ఎంతంటే..!

Updated on: Jul 29, 2020 | 12:40 AM

పశ్చిమ బెంగాల్‌లోని డిఘా తీర ప్రాంతంలో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. ఏనుగు చెవుల ఆకారంలో ఉండే ఈ చేప బరువు అక్షరాల 800 కిలోలు. దీన్ని స్థానికులు శంకర్‌ చేప అని పిలుస్తారట. 8 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ భారీ చేపను చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంతవరకు ఇంత భారీ చేపను తమకెప్పుడూ చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ మీనాన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీని ధర చేపల మార్కెట్లో కిలో రూ. 2,100 చొప్పున దాదాపు రూ. 20 లక్షల పైగానే ఉంటుందంటున్నారు వ్యాపారులు.  ఒడిశాకు సమీపంలోని డిఘా వద్ద ఉన్న ఉదయ్‌పూర్‌ బీచ్‌లో ఈ చేప జాలర్ల వలకు చిక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. శంకర్‌ చేపగా పిలవబడే దీన్ని బెంగాల్‌ వాసులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. గత మార్చి నెలలో కూడా ఇదే రకానికి చెందిన 300 కిలోల చేప మత్స్యకారుల వలకు చిక్కింది.