హైదరాబాద్ లోని పురాతన భవనాలపై.. జీహెచ్‌ఎంసీ సర్వే..

భాగ్యనగరంలో చారిత్రక కట్టడాలతోపాటు.. శిథిలావస్థకు చేరిన భవనాలూ ఉన్నాయి. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో శిథిల భవనాలు- ప్రమాదాలు- కూల్చివేత అంశం మరోమారు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లో

హైదరాబాద్ లోని పురాతన భవనాలపై.. జీహెచ్‌ఎంసీ సర్వే..

Edited By:

Updated on: Jun 10, 2020 | 12:42 PM

Ancient Buildings in Hyderabad: భాగ్యనగరంలో చారిత్రక కట్టడాలతోపాటు.. శిథిలావస్థకు చేరిన భవనాలూ ఉన్నాయి. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో శిథిల భవనాలు- ప్రమాదాలు- కూల్చివేత అంశం మరోమారు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ లో పురాతన భవనాలపై జీహెచ్‌ఎంసీ సర్వే ప్రారంభించింది. ఏళ్ల తరబడి శిధిలావస్థకు చేరుకున్న భవనాల పటిష్టతపై ఆరా తీస్తోంది. పురాతన భవనాల గుర్తింపు.. వాటి పటిష్టతపై జీహెచ్‌ఎంసీ డ్రైవ్ కు సిద్ధమైంది. అనేక ప్రాంతాల్లో జిపిఎస్ ద్వారా అధికారులు సర్వే చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. సర్కిళ్లలో క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నారు. ఎన్ని భవనాలు ఉన్నాయి? ఎన్ని ప్రమాదంగా ఉన్నాయి? అనే దానిపై అంచనాలు వేస్తున్నారు. గత నాలుగేళ్లుగా 1438 బిల్డింగులను జీహెచ్‌ఎంసీ కూల్చివేసింది. కొత్తగా మరిన్ని శిథిల భవనాలను గుర్తించే పనిలో జీహెచ్‌ఎంసీ అధికారులు తలమునకలై ఉన్నారు.

Also Read: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్: ఈ నెల 13 వరకు రైతుబంధు దరఖాస్తుకు అవకాశం