యువతికి ఆరో తరగతి చ‌దివే బాలుడి వేధింపులు..

|

May 22, 2020 | 2:55 PM

ఆ పిల్లాడు చ‌దివేది 6 త‌ర‌గ‌తి అంటే… 10 నుంచి 12 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉంటుంది. అత‌డు 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే..న‌మ్ముతారా. ఆశ్చ‌ర్యంగా అనిపించోచ్చు కానీ ఇది నిజం. ఇందుకు అత‌డు యువతి మార్ఫ్‌డ్‌ చిత్రాలను అస్త్రాలుగా వాడుకున్నాడు. డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్‌ చాట్‌ చేయాలంటూ వేధించ‌డం మొద‌లుపెట్టాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, వేధింపుల‌కు పాల్పడిన‌ పిల్లాడు ఓ టెలిగ్రామ్‌ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్ విద్యార్థుల‌కు […]

యువతికి ఆరో తరగతి చ‌దివే బాలుడి వేధింపులు..
young man attacks woman
Follow us on

ఆ పిల్లాడు చ‌దివేది 6 త‌ర‌గ‌తి అంటే… 10 నుంచి 12 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉంటుంది. అత‌డు 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే..న‌మ్ముతారా. ఆశ్చ‌ర్యంగా అనిపించోచ్చు కానీ ఇది నిజం. ఇందుకు అత‌డు యువతి మార్ఫ్‌డ్‌ చిత్రాలను అస్త్రాలుగా వాడుకున్నాడు. డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్‌ చాట్‌ చేయాలంటూ వేధించ‌డం మొద‌లుపెట్టాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, వేధింపుల‌కు పాల్పడిన‌ పిల్లాడు ఓ టెలిగ్రామ్‌ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్ విద్యార్థుల‌కు సంబంధించిన‌ది. ఇందులో అన్ని వ‌య‌సుల వారు స‌భ్యులుగా ఉంటారు. సీనియ‌ర్లు, జూనియ‌ర్ల‌కు త‌లెత్తే డౌట్స్ క్లారిఫై చేస్తూ.. చ‌దువులో రాణించేందుకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ కంప్లీట్ చేసి.. ప్రజంట్ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న యువతి ఈ గ్రూప్‌లో జాయిన్‌ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా ఈ గ్రూప్‌లో ఎప్ప‌ట్నుంచో ఉన్నాడు. ఆ గ్రూప్ లోనే ఇరువురికి పరిచ‌యం అయ్యింది. మొద‌ట ఆ పిల్లాడు..యువ‌తితో చ‌దువుకు సంబంధించిన విష‌యాలు క్లారిఫై చేయించుకునేవాడు. అలానే మంచివాడిగా న‌టిస్తూ ఆమె వ‌ద్ద న‌మ్మ‌కం పెంచుకున్నాడు.

ఈ క్రమంలో ఆ యువ‌తి ఊహించ‌ని ప‌రిణామాన్ని ఎదుర్కొంది. ఈ నెల 17న ఉదయం 3.30గంటల స‌మ‌యంలో స‌ద‌రు పిల్లాడు, యువతి మొబైల్‌కు ఆమె మార్ఫ్‌డ్ ఫోటోలు పంపించాడు. ఇవి చూసి సదరు యువతి ఒక్కసారిగా షాక్ కి గుర‌య్యింది. 6వ త‌ర‌గ‌తి చ‌దువ‌కునే పిల్లాడు ఇటువంటి ప‌నులు చేస్తాడ‌ని ఆమె అస్స‌లు ఊహించ‌లేదు. ఆమె ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండ‌గానే..ఆ పిల్లాడి నుంచి ఫోన్ వ‌చ్చింది. తాను అడిగినంత డబ్బైనా ఇవ్వాలి.. లేదా తనతో సెక్స్‌ చాట్‌ చేయాలి అనే డైరెక్ట్ డిమాండ్ ఈ సారి. లేదంటే యువతి మార్ఫ్‌డ్‌ ఫోటోలను సామాజిక మాధ్య‌మాల్లో పెడతానని బెదిరింపులకు దిగాడు. అంతేకాక ఆమె ఫోన్‌ను హ్యా​క్‌ చేశానని కూడా చెప్పుకొచ్చాడు ఆ బాలుడు. దాంతో భయపడిన యువతి ఫోన్‌ స్విచ్ఛాఫ్ చేసి..త‌న‌ పేరెంట్స్ కు విష‌యం చెప్పింది. వారు ఆ బాలుడిని పిలిచి మాట్లాడినా..మార్పు రాక‌పోవ‌డంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పిల్లాడిని, అతడి పేరెంట్స్ ను పోలీసులు పీఎస్ కు పిలిపించి విచారించగా.. త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని.. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పోలీసులు సదరు సోషల్‌ మీడియా కంపెనీతో మాట్లాడి యువతి, పిల్లాడి మధ్య జరిగిన చాటింగ్ కు సంబంధించిన సమాచారాన్ని కావాల‌ని కోరారు. సైబర్‌ టీం ఐపీ అడ్రెస్‌ను ఛేదించే ప‌నిలో ఉంది. ఈ క్రమంలో పోలీసులు చిన్న పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్ద‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.