AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న కూతురు కోసం నైట్‌వాచ్‌మన్‌గా మారిన తండ్రి..!

కన్న కూతురు కోసం వాచ్‌మన్‌గా మారాడో తండ్రి. క్వారంటైన్ లో ఉన్న కుమార్తెకి రక్షణగా నిలిచాడు. ఆడవికి దగ్గరగా ఉన్న గ్రామంపై జంతువులు దాడి కాపాడుకుంటున్నాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కుడెకెలాకి చెందిన సుధీర్ ఖల్కో కూతురు ఇటీవల ఒడిశా నుంచి స్వగ్రామానికి వచ్చింది. దీంతో ఆమెను ధరమ్‌జైగఢ్ ప్రభుత్వ హైస్కూల్ భవనంలో క్వారంటైన్‌లో ఉంచారు. ధరమ్‌జైగఢ్‌ గ్రామంపై తరుచూ ఏనుగుల దాడి చేస్తూంటాయి. గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో […]

కన్న కూతురు కోసం నైట్‌వాచ్‌మన్‌గా మారిన తండ్రి..!
Balaraju Goud
|

Updated on: May 22, 2020 | 2:54 PM

Share

కన్న కూతురు కోసం వాచ్‌మన్‌గా మారాడో తండ్రి. క్వారంటైన్ లో ఉన్న కుమార్తెకి రక్షణగా నిలిచాడు. ఆడవికి దగ్గరగా ఉన్న గ్రామంపై జంతువులు దాడి కాపాడుకుంటున్నాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా కుడెకెలాకి చెందిన సుధీర్ ఖల్కో కూతురు ఇటీవల ఒడిశా నుంచి స్వగ్రామానికి వచ్చింది. దీంతో ఆమెను ధరమ్‌జైగఢ్ ప్రభుత్వ హైస్కూల్ భవనంలో క్వారంటైన్‌లో ఉంచారు. ధరమ్‌జైగఢ్‌ గ్రామంపై తరుచూ ఏనుగుల దాడి చేస్తూంటాయి. గత వారం రోజుల్లో ఈ ప్రాంతంలో నలుగురు గ్రామస్థులను ఏనుగులు మట్టుబెట్టాయి. అక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా సరిగాలేవు. అటువంటి ప్రాంతంలో బాధిత మహిళను క్వారంటైన్‌లో ఉంచారు. హైస్కూల్‌లో ఆమె ఒక్కే ఒక్క రోగి కావడం విశేషం. దీంతో మహిళ తండ్రి సుధీర్ ఖల్కో ఆందోళన చెందాడు. కుమార్తెకు రక్షణగా ఉండేందుకు నైట్‌వాచ్‌మన్‌గా మారాడు. రాత్రంతా స్కూలు బయట కూర్చుని కాపలా కాస్తున్నాడు. మహిళ ఉంటున్న క్వారంటైన్ కేంద్రంలో కనీసం ఆహార సదుపాయాలు కల్పించలేకపోయారు అధికారులు. దీంతో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి నుంచి ఆమె తండ్రి ఖల్కో ఆహారం తెచ్చి అందిస్తున్నాడు. తాను ఈ నెల 11 నుంచి క్వారంటైన్ సెంటర్‌లో ఉంటున్నానని, రాత్రుళ్లు సెక్యూరిటీ గార్డు కూడా లేడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఉదయం సమయంలో ఇద్దరు మహిళా సిబ్బంది వచ్చి వైద్య పరీక్షలు చేసి వెళ్తారని.. రాత్రి సమయంలో తనకు కాపలాగా తన తండ్రే కాపాలా ఉంటున్నాడని తెలిపింది. విషయం తెలుసుకున్న ధరమ్‌జైగఢ్ సబ్ డివిజనల్ కలెక్టర్ నంద‌కుమార్ చౌబే స్పందించారు. ఆ క్వారంటైన్ కేంద్రంలో సెక్యూరిటీ సహా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Follow Us
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
నిగనిగలాడుతున్నాయని కొంటున్నారా?.. ఈ సింపుల్ టెస్టులతో నకిలీకి చె
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
పారిశుధ్య కార్మికులకు రూ.2 లక్షల జీతం! మన రాష్ట్రంలోనే..
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
ఈ చార్జీలు ఉండవు.. బ్యాంకుల కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
డైటింగ్ చేస్తున్నారా?.. ఆకలిని చంపి, ఎనర్జీనిచ్చే పవర్ఫుల్ స్నాక్
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
అయ్యబాబోయ్.. 2026 చివరి నాటికి ఊహించని రేంజ్‌కు బంగారం ధర..?
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
15 నెలల సంజనకు కొత్త కుటుంబం,శిశు సంక్షేమంలో కోనసీమ కొత్త అధ్యాయం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 25 ఏళ్లుగా సినిమాలకు దూరం
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఉదయం లేట్‌గా నిద్రలేచిన స్టూడెంట్.. కట్ చేస్తే ఊహించని షాక్..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఫ్లైట్ టికెట్ రూల్స్‌లో మార్పులు.. కొత్త నిబంధనలు ఇవే..
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?
ఇక టీమిండియాను సెమీస్ చేరకుండా అడ్డుకునే సీన్ లేదక్కడ..?