శ్రీశైలంలోని ఘంటా మఠంలో మరో అద్భుతం

|

Sep 24, 2020 | 9:04 PM

 శ్రీశైల దేవస్ధానం పరిధిలోని పంచ మఠాలలో ఒకటైన ఘంటామఠంలో జరుగుతోన్న జీర్ణోధ్ధరణ పనుల్లో మరో అద్భుతం సాక్షాత్కరించింది.

శ్రీశైలంలోని ఘంటా మఠంలో మరో అద్భుతం
Follow us on

శ్రీశైల దేవస్ధానం పరిధిలోని పంచ మఠాలలో ఒకటైన ఘంటామఠంలో జరుగుతోన్న జీర్ణోధ్ధరణ పనుల్లో మరో అద్భుతం సాక్షాత్కరించింది.  పునర్నిర్మాణ పనుల్లో  6 అడుగుల ధ్యాన మందిరం బయటపడింది. ధ్యాన మందిరం లోపలి భాగంలో సొరంగం వైవిధ్యంగా ఉంది. ధ్యాన మందిరం లోపల నైరుతి భాగం నుంచి ఆగ్నేయం వరకు, ఆగ్నేయం మార్గం నుంచి తూర్పు వరకు సొరంగం ఉన్నట్లు  దేవస్థానం అధికారులు గుర్తించారు.  పది రోజుల క్రితమే ఘంటా మఠంలో వెండి నాణేలు, తామ్ర శాసనాలు బయటపడ్డాయి. ధ్యాన మందిరాన్ని యథావిధిగా పునర్నిర్మిస్తామని ఈవో రామారావు తెలిపారు.

 

Also Read :

రామ్ కొణిదెెల, పిక్ అదిరిపోలా !

మామకు అనారోగ్యం, పరామర్శించిన సీఎం జగన్