ఆడి కారు ధర పెరుగుతోంది… కేవలం 2 శాతమే..

ఆడి కారు ధర పెరుగుతోంది... కేవలం 2 శాతమే..

ఆడీ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ లగ్జరీ వాహనాల్లో తిరగాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అయితే మార్కెట్ ప్రభావం ఈ వాహనంపై అధికంగా కనబడుతోంది. దీంతో ఈ వాహనాల...

Sanjay Kasula

|

Nov 11, 2020 | 3:39 PM

Audi Announced a Price Increase : ఆడీ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ లగ్జరీ వాహనాల్లో తిరగాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. అయితే మార్కెట్ ప్రభావం ఈ వాహనంపై అధికంగా కనబడుతోంది. దీంతో ఈ వాహనాల ధర కొద్దిగా సరలిస్తున్నట్లుగా ఆ కంపెనీ ప్రకటించింది.  అన్ని రకాల మోడళ్లపై 2 శాతం వరకు ధరల్ని పెంచుతున్నట్లు జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ ఆడి ఈ విషయాన్ని వెల్లడించింది

పెంచిన ధరలు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ పేర్కొంది. రూపాయి బలహీనత, పెరిగిన ఇన్‌పుట్‌ వ్యయాల దృష్ట్యా ధరల్ని పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సిన్హా దిల్లాన్‌ ఈ వివరాలను వెల్లడించారు.

కస్టమర్లకు మేలిరకమైన మోడళ్లను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, అయితే పెరిగిన ఇన్‌పుట్‌ వ్యయాలు, రూపాయి ఒడిదుడుకుల నేపథ్యంలో ధరల్ని సవరించక తప్పడం లేదని అన్నారు. పెంచిన ధరలకు అనుగుణంగా రాబోయే వేరియంట్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్దామని దిల్లాన్‌ పేర్కొన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu