AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం మరింత తగ్గిందోచ్..

నాలుగైదు రోజుల నుంచి వ‌రుస‌గా ధ‌ర‌ల త‌గ్గుద‌ల కనిపిస్తోంది. గ‌త మూడు నెల‌లుగా అడ్డు అనేదే లేకుండా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం....

బంగారం మరింత తగ్గిందోచ్..
Sanjay Kasula
|

Updated on: Aug 27, 2020 | 1:45 PM

Share

పసిడి తగ్గుతోంది.. బంగారం బంగారం అనుకున్న సామాన్యులకు కొత్త ఆశలు కలిగిస్తోంది. తిరిగి మీ వద్దకే వస్తున్నానంటూ వేగంగా వస్తోంది. కరోనా సమయంలో పై..పైకి ఎగబాకిన గోల్డ్.. ఇప్పుడు రోజు రోజుకు పడిపోతోంది. బ‌ంగారం, వెండి ధ‌ర‌ల తిరోగ‌మ‌నం కొన‌సాగుతున్న‌ది.

గ‌త నాలుగైదు రోజుల నుంచి వ‌రుస‌గా ధ‌ర‌ల త‌గ్గుద‌ల కనిపిస్తోంది. గ‌త మూడు నెల‌లుగా అడ్డు అనేదే లేకుండా పెరిగిన బంగారం ధ‌ర‌లు ఇప్పుడు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. బుధ‌వారం నాటి ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.210 త‌గ్గి రూ.51,963 వ‌ద్ద నిలిచింది. కిలో వెండి ధ‌ర సైతం రూ.1077 త‌గ్గి రూ.65,178కి చేరింది.

అంత‌ర్జాతీయ మార్కెట్‌లలో ప్ర‌తికూల‌త‌లు, రూపాయి మార‌కం విలువ మెరుగుప‌డ‌టం బంగారం, వెండి ధ‌ర‌ల త‌రుగుద‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయ‌ని బులియ‌న్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ మ‌రో మూడు పైస‌లు మెరుగుప‌డి 74.30 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధ‌ర 1918 డాల‌ర్ల వ‌ద్ద‌, ఔన్స్ వెండి ధ‌ర 26.45 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌య్యింది. అయితే బంగారం ధర తగ్గినా అమ్మకాలు పెద్దగా లేవని వ్యాపారస్థులు అంటున్నారు.

Follow Us
ఈ అడవిలోకి అడుగుపెడితే చావే.. OTTలోని ఈ మిస్టరీ థ్రిల్లర్ చూశారా?
ఈ అడవిలోకి అడుగుపెడితే చావే.. OTTలోని ఈ మిస్టరీ థ్రిల్లర్ చూశారా?
బాడీలో ఉన్న షుగర్ మొత్తాన్ని తుక్కు చేసే పవర్ వీటికే మాత్రమే
బాడీలో ఉన్న షుగర్ మొత్తాన్ని తుక్కు చేసే పవర్ వీటికే మాత్రమే
శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల బుకింగ్‌పై టీటీడీ క్లారిటీ
శ్రీవారి రూ.300 దర్శన టికెట్ల బుకింగ్‌పై టీటీడీ క్లారిటీ
ఆనాటి పల్లెటూరు ఇలా ఉండేది! 90ల మధుర జ్ఞాపకాలు
ఆనాటి పల్లెటూరు ఇలా ఉండేది! 90ల మధుర జ్ఞాపకాలు
వందే భారత్ లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఎక్కడ ఇస్తారో తెలుసా..?
వందే భారత్ లోకో పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఎక్కడ ఇస్తారో తెలుసా..?
పితృ పక్షంలో ఇల్లు, భూమి ఎందుకు కొనకూడదంటారు?
పితృ పక్షంలో ఇల్లు, భూమి ఎందుకు కొనకూడదంటారు?
బిడ్డ పుట్టాక భర్తలను ఆడవాళ్లు ఎందుకు అసహ్యించుకుంటారు?
బిడ్డ పుట్టాక భర్తలను ఆడవాళ్లు ఎందుకు అసహ్యించుకుంటారు?
ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి..? చిట్టి గుండె గట్టిగా..
ఒక కుటుంబం నెలకు ఎంత నూనె వాడాలి..? చిట్టి గుండె గట్టిగా..
ఎంత రుద్దినా బకెట్ మరకలు పోవడం లేదా? ఇలా చేయండి!
ఎంత రుద్దినా బకెట్ మరకలు పోవడం లేదా? ఇలా చేయండి!
నాని 'ది ప్యారడైజ్'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్'ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?