జూరాల ఫుల్… శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. రోజు రోజుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో జలాశయాలు నీటితో కలకళలాడుతున్నాయి. కృష్ణా, గోదావరి, ప్రాణహిత పరివాహక...

జూరాల ఫుల్... శ్రీశైలంకు కృష్ణమ్మ పరుగు
Follow us

|

Updated on: Aug 10, 2020 | 7:26 PM

Full of Jurala-Krishnamma Runs to Srisailam : తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. రోజు రోజుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో జలాశయాలు నీటితో కలకళలాడుతున్నాయి. కృష్ణా, గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదుల్లో ఓ మోస్తారు వరద ప్రవహిస్తోంది. ఈ వరదంతా నదులపై ఉన్న ప్రాజెక్టుల్లో చేరడంతో అతి త్వరలోనే గరిష్టమట్టానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

కర్నాటక, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదిలో భారీగా వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆల్మట్టీ, నారాయణపూర్‌ రిజర్వాయర్లు గరిష్టమట్టానికి చేరుకోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. దీంతో జూరాలకు భారీగా వరద వస్తోంది.

మూడు రోజులుగా గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం దిగువకు ఉరకలేస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం పెరింది. జూరాల జలాశయం పూర్తి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 8.203 టీఎంసీలుగా ఉంది. 2లక్షల 52 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 25 గేట్ల ద్వారా లక్షా 92 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ..  శ్రీశైలంకు చేరుతోంది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.