Free Water Supply GHMC: గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పధకం.. ఆధార్‌తోనే వర్తింపు.. మార్గదర్శకాలు జారీ.!

|

Jan 11, 2021 | 8:09 AM

Free Water Supply GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత మంచినీటి పధకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు..

Free Water Supply GHMC: గ్రేటర్‌లో ఉచిత తాగునీటి పధకం.. ఆధార్‌తోనే వర్తింపు.. మార్గదర్శకాలు జారీ.!
Follow us on

Free Water Supply GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత మంచినీటి పధకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పధకానికి ఆధార్ కార్డు అనుసంధానం తప్పనిసరి అని అందులో పేర్కొంది. ఈ పధకం కింద లబ్ది పొందాలనుకునే వారు తమ ఆధార్ కార్డును అనుసంధానం చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఆధార్ లింక్ చేసుకునే గడువును మార్చి నెలాఖరు దాకా పొడిగించింది.

మరోవైపు బస్తీల్లో, మురికివాడల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా .. డాకెట్ ఆధారంగా బిల్లును వసూలు చేస్తామన్నారు. ఇక అపార్ట్‌మెంట్‌లో మీటర్లు తప్పనిసరిగా ఉండాలని.. అక్కడ ఉంటున్న అన్ని కుటుంబాలకు.. ప్రతీ నెలా 20 వేల లీటర్ల చొప్పున ఉచిత నీటిని అందించనుండగా.. నీటి వినియోగం 20 వేల లీటర్లు దాటితే మాత్రం పాత ఛార్జీలతో బిల్లును వసూలు చేయనున్నారు. కాగా, స్లమ్ ఏరియాలు, బస్తీల్లో నల్లా కనెక్షన్లకు పూర్తిగా నీటి బిల్లును రద్దు చేశారు.