గూగుల్, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లపై పన్ను?

భారత దేశంలో లాభాలు ఆర్జిస్తున్న అంతర్జాతీయ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో గూగుల్, ఫేస్‌బుక్‌, ట్విటర్ వంటి కంపెనీలు పన్ను భారాన్ని మోయవలసి రావచ్చు. మన దేశంలో వార్షికాదాయం 20 కోట్లు, లేదా, 5 లక్షల యూజర్లు ఉన్న కంపెనీలపై ప్రత్యక్ష పన్ను విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 2018 కేంద్ర బడ్జెట్‌లో చెప్పుకోదగిన ఆర్థిక స్థితిగతులు ఉండటమనే భావన పరిథిలోకి అంతర్జాతీయ డిజిటల్ కంపెనీలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుందని […]

గూగుల్, ఫేస్‌బుక్‌, ట్విటర్‌లపై పన్ను?
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 31, 2019 | 7:34 PM

భారత దేశంలో లాభాలు ఆర్జిస్తున్న అంతర్జాతీయ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతో గూగుల్, ఫేస్‌బుక్‌, ట్విటర్ వంటి కంపెనీలు పన్ను భారాన్ని మోయవలసి రావచ్చు. మన దేశంలో వార్షికాదాయం 20 కోట్లు, లేదా, 5 లక్షల యూజర్లు ఉన్న కంపెనీలపై ప్రత్యక్ష పన్ను విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 2018 కేంద్ర బడ్జెట్‌లో చెప్పుకోదగిన ఆర్థిక స్థితిగతులు ఉండటమనే భావన పరిథిలోకి అంతర్జాతీయ డిజిటల్ కంపెనీలను తీసుకురావాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

భారత దేశ వాసులు కానటువంటివారు వస్తువులు, సేవలు లేదా ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను భారత దేశంలో నిర్వహించినపుడు, ఆ లావాదేవీల వల్ల చెల్లింపుల మొత్తం ప్రభుత్వం నిర్ణయించే పరిమితికి మించినట్లయితే సిగ్నిఫికెంట్ ఎకనమిక్ ప్రజెన్స్ (చెప్పుకోదగిన ఆర్థిక స్థితిగతులు) ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఈ డిజిటల్ కంపెనీలు ఆన్‌లైన్ అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా భారీ ఆదాయాన్ని సంపాదించుకుంటూ, భారత ప్రభుత్వానికి అతి తక్కువ పన్ను చెల్లిస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu