రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధాని దేవెగౌడ

| Edited By: Pardhasaradhi Peri

Sep 20, 2020 | 8:31 PM

రాజ్యసభ సభ్యునిగా మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధాని దేవెగౌడ
Follow us on

రాజ్యసభ సభ్యునిగా మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చేతులు జోడించి చైర్మన్‌కు కన్నడలో ధన్యవాదాలు తెలిపారు దేవెగౌడ. 26 నెలల తరువాత పార్లమెంట్ లో అడుగుపెట్టారు దేవెగౌడ. దేవెగౌడ రాజ్యసభలో అడుగుపెట్టడం మంచి పరిణామమని వెంకయ్య నాయుడు ఈ సందర్భంగా కొనియాడారు. మాజీ ప్రధాని, దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరైన దేవెగౌడ రాజ్యసభకు రావడం హర్షనీయమన్నారు.

దేవెగౌడ పెద్దల సభకు ఎన్నికైన రెండో మాజీ ప్రధాని. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పెద్దల సభలోనే ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజ్యసభ ద్వారా పార్లమెంటులోకి రావడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే, పార్టీ ఎమ్మెల్యేల జోక్యం, సోనియా మాటతో ఆయన రాజ్యసభలోకి అడుగుపెడుతున్నారు. మొత్తం 16 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దేవెగౌడ.. ఏడుసార్లు అసెంబ్లీకి, 6 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు మాత్రమే ఓడిపోయారు.