AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్ఫ్ బాధితులకు మాజీ ఎంపీ కవిత అపన్నహస్తం

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారికి మాజీ ఎంపీ కవిత చేయూతనందించారు. లాక్ డౌన్ కారణంగా సౌదీలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో ఉన్న తెలంగాణ వాసులు స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు కల్పించారు కవిత. వివిధ జిల్లా లకు చెందిన తెలంగాణ వాసులు బస్సులో 32 మంది ఆదివారం తెల్లవారుజామున స్వస్థలాలకు చేరుకున్నారు.

గల్ఫ్ బాధితులకు మాజీ ఎంపీ కవిత అపన్నహస్తం
Balaraju Goud
|

Updated on: Jun 28, 2020 | 4:44 PM

Share

గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారికి మాజీ ఎంపీ కవిత చేయూతనందించారు. లాక్ డౌన్ కారణంగా సౌదీలో ఉపాధి కోల్పోయి దిక్కుతోచనిస్థితిలో ఉన్న తెలంగాణ వాసులు స్వస్థలాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు కల్పించారు కవిత. వివిధ జిల్లా లకు చెందిన తెలంగాణ వాసులు బస్సులో 32 మంది ఆదివారం తెల్లవారుజామున స్వస్థలాలకు చేరుకున్నారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కోరుట్లకు చెందిన 32 మంది ఉపాధి కోసం గత కొన్ని నెలలుగా గల్ఫ్ దేశం బహ్రెయిన్ లో ఉపాధి కోసం వెళ్లి చిక్కుకున్నారు. చేసేందుకు పనిలేక సొంత రాష్ట్రానికి చేరుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ అనుమతితో బహ్రెయిన్ నుంచి రెండు వారాల క్రితం ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్నారు. విజయవాడ లో 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ లో ఉన్నావారిని . జూన్ 26 తేదీన క్వారంటైన్ పూర్తయినా ప్రయాణ ఏర్పాట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని పలువురు ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవితకు విన్నవించుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన మాజీ ఎంపీ, తెలంగాణ వారికోసం విజయవాడ నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. బస్సులో మాస్కులు, సానిటైజర్ లు అందుబాటులో ఉంచారు. జగిత్యాలకు బస్సు చేరుకోగానే టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు దావ సురేష్ , నాయకులు భోగ ప్రవీణ్, జాగృతి నాయకులు రాజేందర్ రావు స్వాగతం పలికారు. అడిగిన వెంటనే స్పందించి, బస్సు సౌకర్యం కల్పించిన కవితకి కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?