హుస్సేన్‌సాగర్‌ నాలాకు వరద పోటు

ఎడతరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడి ముద్దవుతున్నాయి. హైదరాబాద్ లోని నాలులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో హుస్సేన్‌సాగర్‌ నాలాకు వరద...

హుస్సేన్‌సాగర్‌ నాలాకు వరద పోటు
Follow us

|

Updated on: Aug 17, 2020 | 10:25 PM

Flood Flow into The Hussain Sagar Canal : ఎడతరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడి ముద్దవుతున్నాయి. హైదరాబాద్ లోని నాలులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో హుస్సేన్‌సాగర్‌ నాలాకు వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు పైనుంచి వరదనీరు వచ్చిచేరడంతో హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. దీంతో ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం 513 అడుగులకు చేరుకుంది.

ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా ఉన్న మారియెట్‌ హోటల్, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి నీరు దిగువకు గతంలో కంటే అధికంగా హుస్సేన్‌సాగర్‌ నాలాకు వచ్చిచేరుతోంది. ప్రవాహ ఉధృతి సోమవారం మరింత పెరిగింది. మరొకరోజు వర్షం ఇలా కురిస్తే హుస్సేన్‌సాగర్‌ నాలా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ఎరుకల బస్తీ, బీఎస్‌ నగర్, మారుతీనగర్, అరుంధతీ నగర్, సబర్మతినగర్, బాపూనగర్, అశోక్‌నగర్, లంకబస్తీ, మున్సిపల్‌ క్వార్టర్స్, దోభీగల్లీ తదితర ప్రాంతాలలో నివసించే పేద ప్రజలకు వరద పొంచి ముప్పు ఉంది.

Latest Articles