నేపాల్‌ను ముంచెత్తుతున్న వరదలు..

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:52 PM

Flood Fear Grips Nepal : నేపాల్‌లో వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో ప‌లుప్రాంతాల్లో వ‌ర‌ద‌లు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. సింధిపాల్‌చోక్ ఏరియాలోని కొండ‌ల న‌డుమ లోత‌ట్టు ప్రాంతంలోగ‌ల ఓ వ‌ర‌ద కాలువ ఉప్పొంగి సమీప గ్రామాలను ముంచేసింది. దీంతో కాలువ వెంబ‌డి ఉన్న ప‌లు ఇండ్లు వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోయాయి. మ‌రికొన్ని భ‌వ‌నాల కింద నేల కొట్టుకుపోవ‌డంతో ఎప్పుడు కూలిపోతాయో అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారింది. దీంతో స్థానిక అధికారులు అప్ర‌మ‌త్త‌మై ఆ కాలువ […]

నేపాల్‌ను ముంచెత్తుతున్న వరదలు..
Follow us on

Flood Fear Grips Nepal : నేపాల్‌లో వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో ప‌లుప్రాంతాల్లో వ‌ర‌ద‌లు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. సింధిపాల్‌చోక్ ఏరియాలోని కొండ‌ల న‌డుమ లోత‌ట్టు ప్రాంతంలోగ‌ల ఓ వ‌ర‌ద కాలువ ఉప్పొంగి సమీప గ్రామాలను ముంచేసింది.

దీంతో కాలువ వెంబ‌డి ఉన్న ప‌లు ఇండ్లు వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోయాయి. మ‌రికొన్ని భ‌వ‌నాల కింద నేల కొట్టుకుపోవ‌డంతో ఎప్పుడు కూలిపోతాయో అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారింది. దీంతో స్థానిక అధికారులు అప్ర‌మ‌త్త‌మై ఆ కాలువ వెంబడిగ‌ల ఇండ్ల‌ను ఖాళీ చేయించారు. ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు.

వరదల దాటికి వందలాది ఇళ్ల కొట్టుకుపోయాయి. పలువురు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో గల్లంతయ్యినట్లుగా అధికారులు తెలిపారు. 10 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే రానున్న వారం రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఖాట్మండు వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.