ఐదుగురు ఎంపీలకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. సాధారణ పౌరుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఐదుగురు లోకసభ్యులు కరోనా వైరస్ బారినపడ్డట్లు అధికారుల వెల్లడించారు.
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. సాధారణ పౌరుల నుంచి ప్రజా ప్రతినిధుల దాకా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఐదుగురు లోకసభ్యులు కరోనా వైరస్ బారినపడ్డట్లు అధికారుల వెల్లడించారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశానికి ముందు, లోక్‌సభలో ఐదుగురు సభ్యులు కరోనావైరస్ సోకడం కొంత కలవరాన్ని కలిగిస్తోంది. అయితే వర్షకాల పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యే ముందు ఉభయ సభల సభ్యులందరూ కోవిడ్ -19 పరీక్ష చేయించుకుని తప్పనిసరిగా కోవిడ్ నెగెటివ్ రిపోర్టును సమర్పించాలి. ఇందుకు పార్లమెంటరీ సెషన్ ప్రారంభానికి 72 గంటలలోపు ప్రభుత్వం అనుమతి పొందిన ఏదైనా ఆసుపత్రి గానీ, ప్రయోగశాలలో గానీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పరీక్షలు చేయించుకోవల్సి ఉంటుంది. సభ్యులంతా దాదాపుగా ఇప్పటికే పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాలు రావాల్సి ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి అఖిలపక్ష సమావేశాన్ని కూడా రద్దు చేసింది ప్రభుత్వం. నేరుగా బీఏసీ సమావేశం నిర్వహించి సభలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఖరారు చేశారు. ఈ సమావేశంలో స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ సమస్యలు, సెషన్‌లో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల జాబితాపై చర్చించారు.
కరోనావైరస్ సంక్షోభం కారణంగా, వర్షకాల పార్లమెంటు సమావేశానికి అనేక మార్పులు చేశారు. ప్రతిరోజూ నాలుగు గంటల సెషన్లను మాత్రమే నిర్వహించాలని కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు. క్వశ్చన్ అవర్‌ను తీసేశారు. జీరో అవర్‌ను తగ్గించేశారు. ప్రతీ రోజు నాలుగు గంటలపాటు మాత్రమే సమావేశాలు జరగనున్నాయి.
సామాజిక దూర ప్రమాణాలను నిర్ధారించడానికి, రాజ్యసభ ఛాంబర్, గ్యాలరీలు, లోకసభ ఛాంబర్ సభ్యులను కూర్చునేందుకు ఉపయోగిస్తున్నారు వీరిలో 57 మంది ఛాంబర్‌లో, 51 మంది రాజ్యసభ గ్యాలరీలలో వసతి కల్పిస్తున్నారు. మిగిలిన 136 మంది లోకసభ ఛాంబర్‌లో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు పార్లమెంటు అధికారులు. సభ్యులు మాట్లాడటం చూపించడానికి ఛాంబర్‌లో మరో నాలుగు పెద్ద డిస్ ఫ్లే స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.