Electricity Bills: డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లు చెల్లిస్తే డబ్బులివ్వనున్న ప్రభుత్వం.. ఎక్కడంటే..

|

Dec 26, 2021 | 11:19 AM

డిజిటల్‌ పద్ధతిలో విద్యుత్‌ బిల్లులు చెల్లించే వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు హర్యానా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది...

Electricity Bills: డిజిటల్ పద్ధతిలో విద్యుత్ బిల్లు చెల్లిస్తే డబ్బులివ్వనున్న ప్రభుత్వం.. ఎక్కడంటే..
Digital Payments
Follow us on

డిజిటల్‌ పద్ధతిలో విద్యుత్‌ బిల్లులు చెల్లించే వినియోగదారులకు శుభవార్త. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు హర్యానా ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని కింద ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు చెల్లిస్తే ఇన్సెంటివ్ లభిస్తుంది. ఉత్తర హర్యానా బిజిలీ విత్రన్ నిగమ్ గ్రామీణ వినియోగదారులకు పట్టణ ప్రాంతాల తరహాలో వారి బిల్లుల డిజిటల్ చెల్లింపుపై ప్రోత్సాహకాలను అందించే పథకాన్ని ప్రారంభించింది. ‘మ్హారా గావ్ జగ్మాగ్ గావ్ యోజన’ కింద, రాష్ట్రంలోని 75 శాతానికి పైగా గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు హర్యానా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. డిజిటల్ చెల్లింపుల జరిపేలా గ్రామీణ వినియోగదారులను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. డిజిటల్ చెల్లింపు వల్ల వినియోగదారుల సమయం ఆదా చేయడంతోపాటు వారికి ప్రయోజనం చేకూరుతుంది.

వినియోగదారులు తమ డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, Paytm, MobiKwik వంటి మొబైల్ వాలెట్ అప్లికేషన్‌ల ద్వారా డిజిటల్‌గా విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు. గ్రామీణ ప్రాంత వినియోగదారులకు డిజిటల్‌గా చెల్లించే విద్యుత్ బిల్లులపై తొలిసారిగా రూ.20 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు.

90 శాతానికి పైగా కరెంటు బిల్లులు చెల్లిస్తున్న గ్రామాల పంచాయతీలు, 90 శాతానికి పైగా డిజిటల్‌ చెల్లింపులు చేస్తుంటే అలాంటి గ్రామ పంచాయతీలకు కార్పొరేషన్‌ ద్వారా రూ.2 లక్షలు ఇచ్చి సత్కరించి, ఆ డబ్బును అభివృద్ధి పనులకు వెచ్చిస్తారు.

ప్రతి సబ్-డివిజన్‌లో, త్రైమాసిక ప్రాతిపదికన డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఐదుగురు వినియోగదారులను ఎంపిక చేస్తారు. ప్రతి సబ్‌స్క్రైబర్‌కు రూ. 2100 మొత్తం అందిస్తారు. విలేజ్ స్కూల్/చౌపాల్/పంచాయత్ ఘర్ లేదా ఏదైనా ఇతర పబ్లిక్ ప్లేస్‌లో సబ్-డివిజన్ ఆఫీసర్ సమక్షంలో లాటరీ పద్ధతిలో వినియోగదారులు ఎంపిక చేస్తారు.

ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు అమర్చనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం కాలపరిమితిని నిర్ణయించింది. కొన్ని నెలల క్రితం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చాలని ఆదేశించాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు సూచించింది.

Read Also.. Personal Finance: ఈ నాలుగు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేయండి.. లేకుంటే..