5

జనవరి ఫస్ట్ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ మస్ట్

దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్​టాగ్​ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్ట్​టాగ్​ ​తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

జనవరి ఫస్ట్ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ మస్ట్
Follow us

|

Updated on: Nov 08, 2020 | 4:14 PM

దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్​టాగ్​ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్ట్​టాగ్​ ​తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 1980 మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ​..శనివారం  ఉత్తర్వులు విడుదల చేసింది. 2021 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. టోల్​గేట్ల వద్ద ట్రాఫిక్​ రద్దీని​ నియంత్రించాలనే ఆలోచనతో ఫాస్ట్​టాగ్​ వ్యవస్థను 2017 నుంచి అమలు చేస్తోంది కేంద్రం. ఈ క్రమంలో నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్​టాగ్​ తప్పనిసరి చేసింది. అయితే.. 2019 అక్టోబర్​ నుంచి ద్వి, త్రిచక్ర వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్ట్​టాగ్​ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో.. జనవరి ఫస్ట్ నుంచి అన్ని వాహనాలకు ఫాస్ట్​టాగ్​ తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రెన్యూవల్ చెయ్యాలంటే ఫాస్ట్​టాగ్​ తప్పనిసరి అని తాజా నిబంధనల్లో పొందుపరిచారు. అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా ఫాస్టాగ్ ఉండాలన్న నిబంధనను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు.

Also Read :

దిండు కింద ఫోన్‌ పేలి వ్యక్తికి తీవ్ర గాయాలు

రెండోసారి కరోనా సోకి కడప డాక్టర్ మృతి

రాయ్ లక్ష్మి తండ్రి కన్నుమూత..నటి ఎమోషనల్ పోస్ట్

గోల్డ్ కాయిన్, కొత్త బట్టలు, స్వీట్స్‌తో సిబ్బందికి సర్​ప్రైజ్​