Fastag: కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!

|

Dec 24, 2020 | 7:02 PM

Fastag Mandatory January 1: ఫాస్టాగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకూ..

Fastag: కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!
Follow us on

Fastag Mandatory January 1: ఫాస్టాగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి అని ప్రకటించింది. ఈ ఫాస్టాగ్ విధానం వల్ల టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గుతుందని.. వాహనదారులు తమ సమయాన్ని, ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చునని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఇప్పటికే దేశంలోని ప్రధాన టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం అమలవుతోందన్న ఆయన.. ఫాస్టాగ్ లేని వాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ క్యాష్ కౌంటర్ ఉంటుందని.. త్వరలోనే వాటిని కూడా క్రమక్రమంగా తొలగిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, టోల్ గేట్ల వద్ద క్యాష్‌లెస్ సేవలను పెంచాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం విదితమే.

Also Read:

యాంటీ బయోటిక్స్‌ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట

‘అమ్మఒడి’ వర్తించని వారికి గుడ్ న్యూస్.. ఆ లబ్దిదారులకు మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై ఆర్‌బీఐ స్పందన.. వాటి పట్ల ఆకర్షితులు కావద్దంటూ సూచన..

బిగ్ బాస్ 4: కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నా.. మెహబూబ్ అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు: సోహైల్