సుప్రీంకోర్టు ప్రతిపాదనపై చర్చించిన రైతు సంఘాలు.. సాగు చట్టాలు రద్దు చేసేంతవరకు ఉద్యమిస్తామని స్పష్టం

సాగు చట్టాలను రద్దు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం.. కేంద్రం, రైతులతో కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు సమావేశమై చర్చించారు. దీనిపై నలుగురు సీనియర్ న్యాయవాదులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని రైతలు సంఘాలు వెల్లడించాయి.

సుప్రీంకోర్టు ప్రతిపాదనపై చర్చించిన రైతు సంఘాలు.. సాగు చట్టాలు రద్దు చేసేంతవరకు ఉద్యమిస్తామని స్పష్టం
Follow us

|

Updated on: Dec 17, 2020 | 7:03 PM

సాగు చట్టాలను రద్దు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం.. కేంద్రం, రైతులతో కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు సమావేశమై చర్చించారు. దీనిపై నలుగురు సీనియర్ న్యాయవాదులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని రైతలు సంఘాలు వెల్లడించాయి. చట్టాల రద్దుకు సంబందించిన చర్చించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై కూడా న్యాయవాదుల సలహా తర్వాతే స్పందిస్తామన్నారు. ఒకవేళ చర్చలు జరిగినా.. సమాంతరంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు యధావిథిగా కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్నదే మా ప్రధాన డిమాండ్ అని, ఇందుకు ప్రత్యామ్నాయం ఏదీలేదన్నారు. సాగు చట్టాలు రద్దు చేయకుండా ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతు సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

మరోవైపు, రైతుల ఆందోళనల పట్ల కేంద్రం వైఖరి దారుణంగా ఉందని అఖిల భారత రైతు సమన్వయ పోరాట సమితి మండిపడింది. రైతుల న్యాయమైన డిమాండ్లను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలసత్వం ప్రదర్శిస్తుందని ఆరోపించింది. రోజుకో వాదనతో కేంద్రం రైతులను కించపరుస్తోందన్న నేతలు.. డిసెంబర్ 16న కోలకత్తాలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ, అలాగే డిసెంబర్ 22న ముంబయిలో మరో భారీ ప్రదర్శన ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త సాగు చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సమన్వయ పోరాట సమితి హెచ్చరించింది.

అంతకు ముందు సాగు చట్టాలు, రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తొలుత ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయించాలన్న అంశంపై విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందన్న సుప్రీంకోర్టు.. నిరసన తెలియజేయడం రాజ్యాంగ హక్కుగా అభివర్ణించింది. నిరసనలు ఆస్తి, ప్రాణ నష్టాలకు దారితీయకూడదని సూచించింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పింది. కేంద్రం, రైతులతో కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని వెల్లడించింది. రైతు సంఘాల స్పందన వినాలని అనుకుంటున్నామని తెలిపింది.