సూపర్ స్టార్ హీరో రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులు ఎక్కువే. రజనీ కోసం ఏం చేయడానికైనా వారు సిద్ధంగా ఉంటారు. తాజాగా.. రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ సినిమా పెద్ద హిట్ కావాలని.. ఫ్యాన్స్ ఏకంగా 15 రోజులు ఉపవాసం చేశారు. అంతేకాకుండా.. ఒట్టి నేలపై భోజనం చేస్తూ శ్రీ అమ్మన్‌కు మొక్కులు చెల్లించారు.
మధురైలోని శ్రీ అమ్మన్ ఆలయంలో కొంతమంది రజనీ అభిమానులు.. ‘దర్బార్’ సినిమా హిట్ కావాలని 15 రోజుల నుంచి ఉపవాసం ఉంటూ దీక్ష చేశారు. జనవరి 8వ తేదీన బుధవారం తమ మొక్కులు చెల్లించుకున్నారు. అది కూడా నేలపై భోజనం చేసి.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రజనీకాంత్ నటించిన ‘దర్బార్’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇందులో నయతార హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామస్ రజనీకి కూతురు పాత్రలో నటించింది. ఈ సినిమాని ఏఆర్ మురుగదాస్ నిర్మించగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.