Breaking: ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..

|

Aug 04, 2020 | 7:50 AM

ప్రముఖ వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..

Breaking: ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత..
Follow us on

Folk Singer Vangapandu Prasada Rao: ప్రముఖ వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ తెల్లవారుజామున పార్వతీపురంలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుది శ్వాసను విడిచారు. వంగపండు ప్రసాదరావు వందలాది జానపద పాటలను రచించడమే కాకుండా.. వాటికి గజ్జెకట్టి ఆడి పాడారు. పల్లెకారులతో పాటు, గిరిజనులకు కూడా అవగాహన కల్పించిన ప్రసాదరావు.. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని ఎలుగెత్తి.. గొంతెత్తారు. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జానపద కళాకారులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

కాగా, 1943 జూన్‌లో జన్మించిన వంగపండు ప్రసాదరావు.. దాదాపు 300లకు పైగా పాటలు రాశారు. ఇక ఆయన రాసిన చాలా పాటలను సినిమాల్లోకి కూడా తీసుకున్నారు. ఆయన రాసిన ‘ఏం పిల్లడో ఎళ్ద మొస్తావా’ అనే పాట భారతదేశంలోని అన్ని భాషల్లోనూ ఉంది. ఇండియాలో ఎన్ని పోరాటాలున్నా… అన్ని పోరాటాల‌ను ‘ఏం పిల్ల‌డో ఎళ్ద మొస్త‌వా’ పాట‌తో అల్లుకున్నారు. చీమ‌ల దండు, రైతాంగ పోరాటం, భూమి పోరాటం వంటి సినిమాల‌కు ప్రసాదరావు పాట‌లు రాశారు. ఇక త‌న అనుమ‌తి లేకుండా ‘ఏం పిల్ల‌డో ఎళ్ద మొస్త‌వా’ అనే పాటను మ‌గ‌ధీర సినిమా‌లో వాడినందుకు అప్ప‌ట్లో వంగపండు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.

Also Read:

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

మహిళలకు గుడ్ న్యూస్.. ఆగష్టు 12న ‘వైఎస్ఆర్ చేయూత’కు శ్రీకారం..

”సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. హత్య”!

సుశాంత్ చనిపోయే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసింది ఇవే.!