Family man2: పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు.. ఫ్యామిలీ మ్యాన్ వచ్చేది అప్పుడేనా.?

అమేజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంతటి ప్రేక్షకాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ స్ట్రీమింగ్ దేశవ్యాప్తంగా విజయవంతమైంది. ఇదిలా ఉంటే తాజాగా...

Family man2: పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు.. ఫ్యామిలీ మ్యాన్ వచ్చేది అప్పుడేనా.?
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2020 | 6:10 PM

Family man2 new poster out: అమేజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంతటి ప్రేక్షకాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ఈ వెబ్ స్ట్రీమింగ్ దేశవ్యాప్తంగా విజయవంతమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ది ఫ్యామిలీ మ్యాన్2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో త్వరలోనే విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ మేకర్స్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్‌లో టైమర్ సెట్ చేసిన ఒక బాంబును చూపించారు. ఇక ఈ ఫోటోతో పాటు.. ‘ఇక్కడ టైమర్ గురించి తెలియదు కానీ త్వరలోనే ఎక్సయిట్మెంట్‌తో పేల్చబోతున్నాం’ అని మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ ఫోటోతోనే సిరీస్ ఎప్పుడు విడుదల కానుందన్న క్లూ ఇచ్చినట్లు అర్థమవుతోంది.. ఇక ట్వీట్‌కి పలువురు నెటిజెన్లు స్పందిస్తూ.. ఫిబ్రవరి 12 విడుదల కానుంది అంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే సీజన్2లో అక్కినేని వారి కోడలు సమంత నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో సమంత టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుందని వార్తలు వచ్చాయి. Also read: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌కి కరోనా పాజిటివ్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడి..