AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌ల‌వ‌ర పెడుతున్న స్ట్రైయిన్ ‌.. మరి కొంత కాలం బ్రిటన్‌కు విమానాలు రద్దు: కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్

కొత్త కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనాతో పూర్తిగా కోలుకోక ముందే ఈ కొత్త స్ట్రైయిన్ వైరస్ తో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో....

క‌ల‌వ‌ర పెడుతున్న స్ట్రైయిన్ ‌.. మరి కొంత కాలం బ్రిటన్‌కు విమానాలు రద్దు: కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్
Subhash Goud
|

Updated on: Dec 29, 2020 | 6:00 PM

Share

కొత్త కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనాతో పూర్తిగా కోలుకోక ముందే ఈ కొత్త స్ట్రైయిన్ వైరస్ తో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ – బ్రిటన్ మధ్య విమానాల రాకపోకలు మరి కొంత కాలం నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్ పురి సూత్రప్రాయంగా వెల్లడించారు. బ్రిటన్ కు విమాన సర్వీసులపై తాత్కాలిక రద్దు ఇంకొంత కాలం ఉండవచ్చని అనుకుంటున్నా.. అయితే ఈ పొడిగింపు సుదీర్ఘంగా లేదా నిరవధికంగా ఉండకపోవచ్చు అని అన్నారు. అయితే భారత్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూస్తుండటం, యూకేలో వైరస్ మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

కాగా, జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్ బ్రిటన్ లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. భారత ప్రభుత్వం కూడా ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు బ్రిటన్ కు విమానాల రాకపోకలను రద్దు చేసింది. అయితే డిసెంబర్ 23లోగా దేశానికి చేరుకున్న వారికి విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో పలువురికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే వీరికి సోకింది కరోనా కొత్త వైరసా ? కాదా.. అనే విషయాన్ని తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్ లను పంపించారు. అయితే ఈ పరీక్షల్లో ఇప్పటి వరకు ఆరుగురికి కొత్త రకం స్ట్రైయిన్ వైరస్ నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

Also Read:

కొత్త రకం కరోనా ప్రాణాంతకం కాదు.. వేగంగా విస్తరిస్తుందే కానీ చంపేంత ప్రమాదకరం కాదన్న ఆరోగ్య మంత్రి ఈటల

క‌రోనా వైరస్ సోకిన వారికి ర‌క్త ఇన్ఫెక్ష‌న్ తోడైతే చాలా ప్ర‌మాదం.. అమెరికా యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి