కళ్లు మసక మసకగా కనిపిస్తున్నాయా..? చూపు మందగించిందా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

Eyesight Home Remedies : శరీరంతో పాటు కంటి సంరక్షణ కూడా చాలా ముఖ్యం. తరచుగా ప్రజలు కళ్ళ సమస్యలతో పోరాడుతుంటారు.

కళ్లు మసక మసకగా కనిపిస్తున్నాయా..? చూపు మందగించిందా..! అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?
Eye Care
Follow us
uppula Raju

|

Updated on: Apr 30, 2021 | 3:19 PM

Eyesight Home Remedies : శరీరంతో పాటు కంటి సంరక్షణ కూడా చాలా ముఖ్యం. తరచుగా ప్రజలు కళ్ళ సమస్యలతో పోరాడుతుంటారు. కానీ ఈ సమస్యను చాలామంది విస్మరిస్తున్నారు. ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికి కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో కొన్ని హోమ్ రెమిడిస్ ద్వారా కంటి చూపును ఆరోగ్యంగా ఉంచవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నానబెట్టిన బాదంపప్పు తినండి నానబెట్టిన బాదంపప్పు తినడం కంటి చూపుకు చాలా మంచిది. దీని కోసం మీరు ప్రతి రోజు రాత్రి 7 నుంచి 8 బాదంపప్పులను నానబెట్టవచ్చు. మరుసటి రోజు ఉదయం వాటితో బాదం పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను నీటిలో కలుపుకొని తినవచ్చు. ఇది కళ్ళ సమస్యను తొలగిస్తుంది. బ్రెయిన్ కూడా షార్ప్ గా పనిచేస్తుంది.

2. ఎండుద్రాక్ష, అత్తి పండ్లను తినండి బలహీనమైన కంటి చూపుతో బాధపడుతున్నవాళ్లు నానబెట్టిన ఎండుద్రాక్ష, అత్తి పండ్లను తీసుకోవచ్చు. ఇందుకోసం రాత్రి 2 అత్తి పండ్లను 10 నుంచి 15 ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.

3. కళ్ళకు వ్యాయామం కల్పించండి కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కళ్ళ వ్యాయామం తప్పనిసరి. ఇది ఒత్తిడికి కూడా ఉపశమనంలా పనిచేస్తుంది. దీని కోసం మీ రెండు చేతులను కలిపి రుద్ది వాటిని కళ్ళ మీద ఉంచండి. కొద్దిసేపటి తరువాత చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇది కాకుండా మీరు ఐబాల్ ను ఎడమ నుంచి కుడికి, పైకి క్రిందికి తిప్పవచ్చు.

4. బాదం, సోంపు, చక్కెర మిశ్రమం కంటి చూపుకు ఈ హోం రెమెడీ చాలా మేలు చేస్తుంది. దీని కోసం మీకు బాదం, సోపు గింజలు, చక్కెర అవసరం. వీటిని మెత్తగా పొడిలా చేసి రాత్రి పడుకునేముందు ఒక చెంచా పొడిని పాలలో కలిపి తీసుకోవాలి. ఇలా వారం రోజులు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.

5. దేశి నెయ్యి ఆయుర్వేదంలో దేశి నెయ్యి చాలా ముఖ్యమైనది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. నెయ్యిలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి కళ్ళ కాంతిని మెరుగుపరుస్తాయి. ఇందుకోసం మీరు కళ్ళకు నెయ్యి పూయాలి. కొన్ని నిమిషాలు మసాజ్ చేయాలి.

6. గూస్బెర్రీ రోజూ ఉదయం ఒక టీస్పూన్ ఆమ్లా రసం తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కళ్ళ సమస్యను తగ్గించడంలో ఆమ్లా సహాయపడుతుంది.

DGCA: అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ

Corona Vaccine: రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీం కోర్టు.. వ్యాక్సిన్‌ ధరల విషయంలో కేంద్రంపై కీలక వ్యాఖ్యలు

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?