BREAKING NEWS : ఆదిలాబాద్ జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జైత్రమ్ తండాలో సర్పంచ్-మాజీ సర్పంచ్ భర్తకు మధ్య వివాదం చెలరేగింది.  మాజీ సర్పంచ్ భర్త గజానంద్ వర్గంలో..

  • Sanjay Kasula
  • Publish Date - 7:18 am, Tue, 28 July 20
BREAKING NEWS : ఆదిలాబాద్ జిల్లాలో ఇరువర్గాల ఘర్షణ

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. జైత్రమ్ తండాలో సర్పంచ్-మాజీ సర్పంచ్ భర్తకు మధ్య వివాదం చెలరేగింది. గొడవ చినికి చినికి పెద్ద గొడవగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన తాండవాసులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో మాజీ సర్పంచ్ భర్త గజానంద్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆగ్రహంతో సర్పంచ్ వర్గానికి చెందిన మూడు ఇళ్లను మాజీ సర్పంచ్ వర్గీయులు తగులబెట్టారు.

అయితే ఈ ఘర్షణల మధ్యే ఆయన చనిపోయారాని ఆదిలాబాద్ ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. జైత్రమ్ తాండకు అదనపు పోలీస్ బలగాలను పంపించినట్లుగా ఎస్పీ తెలిపారు. గొడవకు కారణమైన పలువురిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఈ ఘటనలో మూడు ఇళ్లతోపాటు ఒక కారు, నాలుగు బైక్ లను తగలబెట్టారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.