సంగారెడ్డిలో మాదకద్రవ్యాలు.!

సంగారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న తిరుమల ఎస్టేట్ వెంచర్లో మాదకద్రవ్యాలు అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు. నమ్మదగిన సమాచారంతో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గాయత్రి దేవి తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆశిష్ ఆయిల్ అనే డ్రగ్స్ ఉన్న 75 బాటిల్స్ తో పాటు.. గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు ఎక్సైజ్ పోలీసులు. వీటిని అమ్ముతున్న జయంత్ పటేల్ […]

  • Venkata Narayana
  • Publish Date - 3:48 pm, Sat, 7 November 20
సంగారెడ్డిలో మాదకద్రవ్యాలు.!

సంగారెడ్డి పట్టణానికి సమీపంలో ఉన్న తిరుమల ఎస్టేట్ వెంచర్లో మాదకద్రవ్యాలు అమ్ముతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు. నమ్మదగిన సమాచారంతో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గాయత్రి దేవి తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆశిష్ ఆయిల్ అనే డ్రగ్స్ ఉన్న 75 బాటిల్స్ తో పాటు.. గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు ఎక్సైజ్ పోలీసులు. వీటిని అమ్ముతున్న జయంత్ పటేల్ తో పాటు ముఠా సభ్యులు అయిన బొంతు నాగబాబు, తప్పిట గణపతిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.. వీరికి సంబంధించిన ఒక కారు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.