గూగుల్‌కు భారీ ఫైన్

|

Mar 20, 2019 | 7:54 PM

బ్రస్సెల్స్‌: సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌కు ఐరోపా సమాఖ్య(ఈయూ) బుధవారం గట్టి షాకిచ్చింది. ఆ సంస్థకు యూరోపియన్‌ యూనియన్‌ యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటరీ పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. సెర్చింజిన్‌ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందని యూనియన్‌ పేర్కొంది. పోటీదారులను రానీయకుండా.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు గూగుల్‌ యాప్స్‌నే వాడేలా అనుచిత విధానాలను గూగుల్‌ అనుసరిస్తుందనే ఆరోపణలతో ఈ జరిమానా వేసింది. తన వ్యాపార ధోరణిని మార్చుకోవాలని గూగుల్‌ను యూరోపియన్‌ యూనియన్‌ ఆదేశించింది. దీనిపై ఈయూ కాంపిటీషన్‌ కమిషనర్‌ […]

గూగుల్‌కు భారీ ఫైన్
Follow us on

బ్రస్సెల్స్‌: సెర్చింజిన్‌ దిగ్గజం గూగుల్‌కు ఐరోపా సమాఖ్య(ఈయూ) బుధవారం గట్టి షాకిచ్చింది. ఆ సంస్థకు యూరోపియన్‌ యూనియన్‌ యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటరీ పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. సెర్చింజిన్‌ తన విధులను మర్చిపోయి నమ్మకాన్ని కోల్పోయిందని యూనియన్‌ పేర్కొంది. పోటీదారులను రానీయకుండా.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు గూగుల్‌ యాప్స్‌నే వాడేలా అనుచిత విధానాలను గూగుల్‌ అనుసరిస్తుందనే ఆరోపణలతో ఈ జరిమానా వేసింది. తన వ్యాపార ధోరణిని మార్చుకోవాలని గూగుల్‌ను యూరోపియన్‌ యూనియన్‌ ఆదేశించింది. దీనిపై ఈయూ కాంపిటీషన్‌ కమిషనర్‌ మార్గరెట్‌ వెస్టాగర్‌ ట్వీట్ చేశారు.

గతేడాది కూడా గూగుల్‌ భారీ మొత్తంలో 2.8 బిలియన్‌ డాలర్ల( రూ.17,478 కోట్లకు పైగా) జరిమానాను ఎదుర్కొంది. అప్పుడు తన షాపింగ్‌ సర్వీసులకు అనుకూలంగా యాంటీ ట్రస్ట్‌ నిబంధనలను అది ఉల్లంఘించడంతో, జరిమానా పడింది.