భారత-అమెరికా దేశీయులకు నో ఎంట్రీ…ఈయూ కూటమి

పదిహేను దేశాలకు చెందిన టూరిస్టుల కోసం తమ బోర్డర్లను తెరుస్తున్నామని యూరపియన్ యూనియన్ ప్రకటించింది. అయితే ఇండియా, అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాలవారిని మాత్రం అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ రాకాసి..

భారత-అమెరికా దేశీయులకు నో ఎంట్రీ...ఈయూ కూటమి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 01, 2020 | 4:22 PM

పదిహేను దేశాలకు చెందిన టూరిస్టుల కోసం తమ బోర్డర్లను తెరుస్తున్నామని యూరపియన్ యూనియన్ ప్రకటించింది. అయితే ఇండియా, అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాలవారిని మాత్రం అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ రాకాసి ప్రబలంగా ఉన్న ఈ దేశాల విజిటర్లకు నో ఎంట్రీ అని పేర్కొంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, జార్జియా, జపాన్, మాంటినీగ్రో, మొరాకో, న్యూజిలాండ్ తదితర 15 దేశాల వారికి పర్మిషన్ ఇస్తున్నట్టు తమ జాబితాలో ఈ కూటమి వెల్లడించింది. చైనా విషయానికి వస్తే.. తమ దేశాల టూరిస్టులను ఆ దేశం అనుమతిస్తేనే.. చైనీయులకు తమ సరిహద్దులు ఓపెన్ చేస్తామని షరతు విధించారు. ఈ లిస్టును ప్రతి 14 రోజులకొకసారి అప్ డేట్ చేస్తుంటారు. కొత్త దేశాలను చేర్చడమొ, లేక మరి కొన్ని దేశాలను ‘పక్కన పెట్టడమో’ చేస్తుంటారు. కరోనా వైరస్ ని ఆయా దేశాలు కంట్రోల్ చేస్తున్నాయా లేదా అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది.

ఈయూ నుంచి విజిటర్లను నిషేధిస్తున్నట్టు అమెరికా గత మార్చిలోనే ప్రకటించింది. ప్రతి ఏడాదీ సుమారు కోటిన్నర మంది అమెరికన్లు యూరప్ దేశాలను సందర్శిస్తుంటారు. యూరప్ టూరిజం ఇండస్ట్రీలో అమెరికాకు భారీ వాటా ఉంది. అయితే అమెరికాలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతోంది. దీంతో ఈయూ భయపడుతోంది.

Latest Articles
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఆ పెట్టుబడి పథకంతో అదిరే లాభాలు.. ఎఫ్‌డీ కంటే సూపర్ రిటర్న్స్
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
ఎప్పుడూ నిద్ర మత్తుగా ఉంటుందా.? ఈ విటమిన్‌ లోపం ఉన్నట్లే..
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
తారక్ పుట్టిన రోజున అదిరిపోయే అప్డేట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
మరో సరికొత్త రికార్డులో కింగ్ కోహ్లీ.. తొలి టీమిండియా ప్లేయర్‌గా
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
తెలంగాణ బీజేపీ ఎన్నికల ప్రచారంలో మలయాళ నటుడు..
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
బజాజ్ పల్సర్ 125 రిలీజ్ చేశారోచ్చ్… ఆ బైక్‌లకు గట్టి పోటీ
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
మైలేజ్ ఆలోచించే కారు కొంటున్నారా..? ఆ కార్లల్లో ప్రధాన తేడాలివే.!
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
పాకిస్థానీయులకు వైద్య సహాయం అందించిన భారత నావీ
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. గాయపడిన రోహిత్..
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది
ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో..ఇది కాదా అభిమానులకు కావాల్సింది