ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో సంచలన రేపిన ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆరోణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మా, వసంత, రాధిక, హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పద్మ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తీవ్ర మనస్తాపానికి లోనైన పద్మ.. జైల్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లడంతో […]
తెలంగాణలో సంచలన రేపిన ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆరోణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణం వ్యవహారంలో ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మా, వసంత, రాధిక, హర్షవర్ధన్‌తో పాటు మరో ఇద్దరిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పద్మ చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తీవ్ర మనస్తాపానికి లోనైన పద్మ.. జైల్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లడంతో హుటాహుటీన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే రిమాండ్ ఖైదీ పద్మకు అన్ని నిద్రమాత్రలు ఎలా వచ్చాయనే విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.