ఆర్టీసీ సమ్మె ఉధృతం చేస్తాం: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీ సమ్మె 15 రోజుకు చేరింది. శనివారం రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తూ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన బంద్‌కు ప్రతిపక్షపార్టీలు పూర్తి మద్దతుగా నిలిచాయి. వివిధ ఉద్యోగ, విద్యార్ధి, కార్మిక సంఘాలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. కొన్నిచోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే భవిష్యత్తు కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలు ఇతర జేఏసీ నేతలతో శనివారం సాయంత్రం భేటీ అయ్యి చర్చించారు. […]

ఆర్టీసీ సమ్మె  ఉధృతం చేస్తాం:  అశ్వత్థామరెడ్డి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 19, 2019 | 9:39 PM

ఆర్టీసీ సమ్మె 15 రోజుకు చేరింది. శనివారం రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తూ ఆర్టీసీ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగిన బంద్‌కు ప్రతిపక్షపార్టీలు పూర్తి మద్దతుగా నిలిచాయి. వివిధ ఉద్యోగ, విద్యార్ధి, కార్మిక సంఘాలు కూడా బంద్‌లో పాల్గొన్నాయి. కొన్నిచోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే భవిష్యత్తు కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిలు ఇతర జేఏసీ నేతలతో శనివారం సాయంత్రం భేటీ అయ్యి చర్చించారు. ఆదివారం ఉదయం రాజకీయ జేఏసీతో భేటీ కావాలని అదే విధంగా ఎంఐఎం నేతలను వీరు నిర్ణయించారు. అదే విధంగా అక్టోబర్ 23 న ఉస్మానియా యూనివర్సిటీలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని అశ్వత్థామరెడ్డి తప్పుబట్టారు. ప్రభుత్వం తప్పుమీద తప్పు చేసుకుంటూ పోతుందని, న్యాయస్ధానం ఆదేశాలను సైతం పాటించడం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఉద్యమం రాలేదని, తన ఆందోళనలో భాగంగా ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతాం. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మరోసారి గవర్నర్ ను కలుస్తామన్నారు.

ఆదివారం ఉదయం అన్ని చౌరస్తాల్లో నిలబడి ప్రజలకు పువ్వులు పంచుతూ తమ డిమాండ్లను వివరిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. అదే విధంగా రాజకీయ జేఏసీతో భేటీ తర్వాత భవిష్యత్తు పోరాటంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వమే నష్టాలపాలు చేస్తుందని ఈ సందర్భంగా పలువురు నేతలు విమర్శించారు. ప్రభుత్వం తమతో ఖచ్చితంగా చర్చలు జరిపితీరాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు.