మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ కవిత!
ఆధునిక ప్రపంచంలో… సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపత్కర పరిస్థితుల్లో నేతలను చేరుకోవడం.. వారు స్పందించడం చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కొన్నిసార్లు రాజకీయాలను పక్కన పెట్టి నేతలు మానవత్వాన్ని చాటుకోవడం వారి ఉదార స్వభావానికి నిదర్శనం. తాజాగా నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళితే… ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఖరీదైన వైద్య చికిత్సను భరించే స్థితి లేకపోవడంతో […]
ఆధునిక ప్రపంచంలో… సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపత్కర పరిస్థితుల్లో నేతలను చేరుకోవడం.. వారు స్పందించడం చాలా వేగంగా జరిగిపోతున్నాయి. కొన్నిసార్లు రాజకీయాలను పక్కన పెట్టి నేతలు మానవత్వాన్ని చాటుకోవడం వారి ఉదార స్వభావానికి నిదర్శనం. తాజాగా నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళితే…
ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఖరీదైన వైద్య చికిత్సను భరించే స్థితి లేకపోవడంతో పలువురి సహాయాన్ని ఆర్థించారు. కానీ వారికి కావాల్సినంత ఆర్థిక సహాయం అందకపోవడంతో, మాజీ ఎంపీ కవితను సహాయం ఆర్థిస్తూ అక్క మమ్మల్ని ఆదుకోమంటూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. మంత్రి కేటీఆర్, కవితను సహయమందించాలని కోరారు. ‘కవిత అక్క.. మేము నిజామాబాద్ జిల్లాకు చెందిన వాళ్లం. నిజామాబాద్‌లో జరిగిన ఓ ప్రమాదంలో చెన్నోజి రాము తీవ్రంగా గాయపడ్డాడు. వాళ్లు ప్రస్తుతం హాస్పిటల్ ఖర్చులు భరించే స్థితిలో లేరు అని ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో హైదరాబాద్ లోని బర్కత్‌పుర ఆస్పత్రిలో చేర్పించారు.
@KTRTRS @RaoKavitha Kavitha Akka please help this family frm Nizamabad. He met vth an accident at Nizamabad. They are not in a position to bare d hospital expenses. Nizamabad hospital didn’t allow him for admission & referred to Hyd hospital. He is admitted at Barkatpura. pic.twitter.com/uS54XXvOnR
— Suresh (@SureshKodanda) October 18, 2019
ట్విట్టర్‌లో పోస్టు చూసిన వెంటనే మాజీ ఎంపీ కవిత వేగంగా స్పందించారు. వెంటనే ఆమె నా కార్యాలయ సిబ్బందిని కలువండి. 040-23599999 ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి పరిస్థితిని వివరించండి. మేము తగిన సహాయం.. మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. మీకు అంతా మేలు జరుగుతుంది అనే భరోసాను ఎంపీ కవిత అందించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Pls contact my office 040-23599999. Will do my best !! https://t.co/DPENhwxse3
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 18, 2019