షోపియాన్ జిల్లాలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామునే మళ్లీ కాల్పుల మోత మొగుతోంది. షోపియాన్ జిల్లాలోని డ్రాగడ్ సుగాన్ ప్రాంతంలో.. భ్రదతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే ఇది గమనించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగారు. అయితే ఉగ్రవాదుల కోసం ఇంకా వేట కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గురువారం రోజు బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు […]

జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామునే మళ్లీ కాల్పుల మోత మొగుతోంది. షోపియాన్ జిల్లాలోని డ్రాగడ్ సుగాన్ ప్రాంతంలో.. భ్రదతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే ఇది గమనించిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగారు. అయితే ఉగ్రవాదుల కోసం ఇంకా వేట కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గురువారం రోజు బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.



