బ్రేకింగ్ః‌ ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. 2021 జ‌న‌వ‌రి ఒక‌టి అర్హ‌త తేదీతో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి శ‌శాంక్ గోయ‌ల్ తెలిపారు. కాగా అక్టోబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ప్రీరివిజ‌న్..

బ్రేకింగ్ః‌ ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2020 | 6:42 PM

ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. 2021 జ‌న‌వ‌రి ఒక‌టి అర్హ‌త తేదీతో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి శ‌శాంక్ గోయ‌ల్ తెలిపారు. కాగా అక్టోబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ప్రీరివిజ‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. పోలింగ్ కేంద్రాల హేతు బ‌ద్దీక‌ర‌ణ‌, డూప్లికేట్ ఓట్లు తొల‌గింపు, పోలింగ్ కేంద్రాల స‌ర్దుబాటు, మార్పులు, చేర్ప‌లు ఇందులో ఉంటాయి. న‌వంబ‌ర్ 16 నుంచి ఓటర్ల జాబితా ముసాయిదా విడుద‌ల చేస్తారు.

కాగా ఆ రోజు నుంచి డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు అభ్యంత‌రాలు, విన‌తుల స్వీక‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంది. ఇందు కోసం పోలింగ్ బూత్‌ల వద్ద అధికారులు, సిబ్బంది అంద‌రికీ అందుబాటులో ఉండేలా నెల‌లో రెండు శ‌ని, ఆదివారాలు ప్ర‌త్యేక అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. ఇక 2021 జ‌న‌వ‌రి 15న తుది ఓట‌ర్ల జాబితా ప్ర‌క‌టిస్తారు. కాగా 18 ఏళ్లు వ‌య‌సు క‌లిగిన‌వారు ఓటు హ‌క్కు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. www.nvsp.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

Read More:

క‌రోనా నుంచి కోలుకున్న డైరెక్ట‌ర్‌ రాజ‌మౌళి కుటుంబం

దేశ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు, క‌ర్నాట‌క‌కి ఎల్లో అలెర్ట్

క‌రోనాతో మ‌ర‌ణించిన మాజీ ఎమ్మెల్యే మ‌న‌వ‌ళ్లు