బ్రేకింగ్: కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ అరెస్ట్

 కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్‌ను ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో శివకుమార్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత నాలుగు రోజులుగా మనీ ల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు శివకుమార్‌ను విచారిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో శివకుమార్, ఇతరులపై  ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆదాయ పన్ను శాఖ ఫైల్ చేసిన ఛార్జిషీట్ ఆధారంగా కాంగ్రెస్ నేతపై ఈడీ కేసు పెట్టింది. ఇప్పటికే ఆయన్ను కస్టడీలోకి […]

బ్రేకింగ్: కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​ అరెస్ట్
ED arrests ex-Karnataka minister and Congress leader D.K. Shivakumar

 కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు డీకే శివకుమార్‌ను ఈడీ అధికారులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. మనీ ల్యాండరింగ్‌ కేసులో శివకుమార్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత నాలుగు రోజులుగా మనీ ల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు శివకుమార్‌ను విచారిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో శివకుమార్, ఇతరులపై  ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆదాయ పన్ను శాఖ ఫైల్ చేసిన ఛార్జిషీట్ ఆధారంగా కాంగ్రెస్ నేతపై ఈడీ కేసు పెట్టింది. ఇప్పటికే ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న ఈడీ ఆయనపై ప్రశ్నలు గుప్పిస్తోంది. శుక్రవారం నాలుగు గంటలపాటు ఆయన్ను ప్రశ్నించిన ఈడీ.. శనివారం 8 గంటలపాటు ఆయన్ను విచారించింది.

మనీలాండర్ నిరోధక చట్టం ప్రకారంం డీకే స్టేట్‌మెంట్‌ను రెండుసార్లు రికార్డ్ చేశారు. డీకే శివకుమార్ విషయంలో బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. శివకుమార్ ఎలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడలేదని మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప తెలిపారు.  ఆగష్టు 30న శివకుమార్ తొలిసారి ఈడీ ముందు హాజరయ్యారు. విచారణకు తాను సహకరిస్తానని, చట్టాన్ని గౌరవిస్తానని ఆయన తెలిపారు. ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆయన పిటీషన్‌ను కొట్టివేసింది.

Click on your DTH Provider to Add TV9 Telugu