AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loksabha Elections: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ పై ఈసీ కసరత్తు.. తేదీల ఖరారు ఎప్పుడంటే..?

ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికలు 2024 త్వరలోనే జరుగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోసం వరుస పర్యటనలు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 9 తర్వాత ఏ క్షణమైనా 2024 లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.

Loksabha Elections: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ పై ఈసీ కసరత్తు.. తేదీల ఖరారు ఎప్పుడంటే..?
Election Commission
Balu Jajala
|

Updated on: Feb 20, 2024 | 12:22 PM

Share

ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికలు 2024 త్వరలోనే జరుగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల కోసం వరుస పర్యటనలు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 9 తర్వాత ఏ క్షణమైనా 2024 లోక్ సభ ఎన్నికలకు ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. 2024 ఏప్రిల్, మే నెలల్లో 18వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 2024 ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఇప్పటికే ఈసీఐ అధికారుల బృందం వివిధ రాష్ట్రాల్లో వరుసగా పర్యటిస్తోంది.

జమ్మూకశ్మీర్ భద్రతా పరిస్థితి, బలగాల లభ్యత గురించి తెలుసుకోవడానికి ఈసీ అధికారులు మార్చి 8-9 మధ్య ప్రభుత్వ ప్రతినిధులను కలుస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించవచ్చా లేదా అని తెలుసుకోవడానికి ఈ నెల 12,13 తేదీల్లో ఈసీ అధికారులు జమ్ముకశ్మీర్లో పర్యటించనున్నారు. అయితే చివరిసారిగా 2019 పార్లమెంట్ ఎన్నికల తేదీలను మార్చి 10న ప్రకటించగా, ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా, మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.

అయితే పార్లమెంట్ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రధాన పార్టీలు రంగంలోకి దిగాయి. ఇటీవలనే ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ నేతలు దిశానిర్దేశం చేస్తూ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఏన్డీఏ 400 సీట్లు సాధించి మూడోసారి అధికారంలోకి రావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మోడీ అయోధ్య రామమందిరం ప్రత్యేక ఎజెండా ఎత్తుకోబోతుండగా, కాంగ్రెస్ మాత్రం ఛలో ఢిల్లీ, మణిపూర్ అల్లర్లు, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావిస్తూ జనాల్లో వెళ్లే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల ముందు ఇండియా కూటమికి వరుసగా షాకులు తగులుతుండటం ఆ నేతలకు మింగుడు పడటం లేదు.

ఇక ప్రపంచ నాయకులలో  ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతమైన నాయకుడు అని , ఇతరులకు భిన్నంగా నిలిచారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలకు లక్నోలో జరిగిన భూమిపూజ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వం, మార్గదర్శకత్వంలో యావత్ భారతదేశం పురోగతి సాధిస్తోందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి