AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీటలు వారిన గోడలు, రెండుగా చీలిపోయిన రోడ్లు, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో భూకంప విలయం

అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో బుధవారం  సంభవించిన భూకంపంలో ప్రాణ నష్టం జరగకపోయినా.. ఆస్థి నష్టం  భారీగా  సంభవించింది.రిక్టర్ స్కేలుపై  దీని  తీవ్రత   6.4 గా నమోదయింది. ముఖ్యంగా అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో ఉదయం 7.50 గంటల  ప్రాంతంలో   భూప్రకంపనలు మొదలయ్యాయి.

బీటలు వారిన గోడలు, రెండుగా చీలిపోయిన రోడ్లు,  అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో భూకంప విలయం
Earhquake In Assam
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 28, 2021 | 12:48 PM

Share

అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో బుధవారం  సంభవించిన భూకంపంలో ప్రాణ నష్టం జరగకపోయినా.. ఆస్థి నష్టం  భారీగా  సంభవించింది.రిక్టర్ స్కేలుపై  దీని  తీవ్రత   6.4 గా నమోదయింది. ముఖ్యంగా అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో ఉదయం 7.50 గంటల  ప్రాంతంలో   భూప్రకంపనలు మొదలయ్యాయి. అదే సమయంలో మేఘాలయ లోను,   బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలలోను దీని ప్రభావం కనిపించింది. అస్సాంలో   చోట్ల ఇళ్లు, భవనాలు  దెబ్బ  తిన్నాయి.రోడ్లు రెండుగా చీలిపోయాయి. అయితే ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ  రాష్ట్రం లోని భైరవ్ మండ్ హిల్స్ లో భూకంప ప్రభావం తీవ్రంగా  ఉంది. ధికన్ జౌళి లోని నారాయణ్ పూర్ ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయింది.  ఇక్కడ ఒక్కసారిగా నీరు నేలపై నుంచి పైకి  వచ్చింది. ఈ భూకంపం కారణంగా అస్సాంలో సంభవించిన నష్టం తాలూకు  ఫోటోలు, వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ భూకంప సమాచారం తెలిసిన వెంటనే ప్రధాని  మోదీ  అస్సాం   సీఎంకి ఫోన్  చేసి కేంద్రం నుంచి ఎలాంటి సాయం అవసరమైనా చేస్తామని హామీ ఇఛ్చారు. అటు గౌహతి లో    ఫైవ్ స్టార్ హోటల్,   మరి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. నాగౌన్, తేజ్ పూర్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. హోమ్ మంత్రి అమిత్ షా కూడా సీఎం సర్బానంద సోనోవాల్ తో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితి గురించి తెలుసుకున్నారు.  మేఘాలయ లో సైతం భూకంప  ప్రభావం కనిపించింది. ఈ రాష్ట్రంలోనూ పలు చోట్ల ఇళ్ల గోడలు బీటలు వారినట్టు అధికారులు తెలిపారు. షిలాంగ్ లో భవనాలు కొన్ని దెబ్బ తిన్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?

Assam Earthquake: అస్సాంలో భారీ నష్టాన్ని మిగిల్చిన భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో ఇల్లు.. షాకింగ్ వీడియో..

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.