దేశవ్యాప్తంగా అంబరాన్ని తాకిన దసరా సంబరాలు

|

Oct 25, 2020 | 10:16 PM

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు సంప్రదాయరీతిలో జరుపుకున్నారు. పంజాబ్‌లోని లూధియానాలో రావణ దహనం కార్యక్రమం కలర్‌ఫుల్‌గా జరిగింది. దసరా గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

దేశవ్యాప్తంగా అంబరాన్ని తాకిన దసరా సంబరాలు
Follow us on

Dussehra Celebrations : దేశవ్యాప్తంగా దసరా సంబరాలు సంప్రదాయరీతిలో జరుపుకున్నారు. పంజాబ్‌లోని లూధియానాలో రావణ దహనం కార్యక్రమం కలర్‌ఫుల్‌గా జరిగింది. దసరా గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం పరిమిత స్థాయిలోనే జనానికి అనుమతిచ్చారు.

లూధియానాలో 30 అడుగుల రావణుడి బొమ్మను దహనం చేశారు. విజయదశమి వేడుకలకు సూచనగా టపాసులు పేల్చారు. జనం ఆన్‌లైన్‌లో వీక్షించేందుకు అధికార యంత్రాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో కూడా రావణదహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రావణుడితో పాటు మేఘనాథ్‌ , కుంభకర్ణుడి బొమ్మలను దహనం చేశారు. విజయదశమి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.