దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో భక్తి శ్రద్దలతో ప్రజలు అమ్మవారిని పూజిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారు వేరు వేరు అలంకారాల్లో దర్శననమిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవీ నవరాత్రులు సంబరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఆర్యవైశ్య సంఘంలో నెలకొల్పిన దుర్గామాత మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ధనం తో అలంకరించారు. సుమారు రూ. 35 లక్షల 55వేల 555రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు భక్తులు.
అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంచాలమ్మతల్లి ధనలక్ష్మి దర్శనమిచ్చారు. అమ్మవారి విగ్రహాన్ని రూ. 10నుంచి 100 నోట్లతో అలంకరించారు గ్రామస్తులు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో దుర్గ మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :