దుబ్బాక దంగల్: 15వ రౌండ్‌లో పుంజుకుంటున్న టీఆర్ఎస్…
Dubbaka Dangal: సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తి అయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత కు 2537 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 784 ఓట్లు లభించాయి. ఇక 15వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 955 ఓట్లు ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం […]

Dubbaka Dangal: సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 14 రౌండ్లు పూర్తి అయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత కు 2537 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 784 ఓట్లు లభించాయి.
ఇక 15వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 955 ఓట్లు ఆధిక్యం వచ్చింది. ప్రస్తుతం 15వ రౌండ్ ముగిసేసరికి మొత్తం ఓట్లు ఇలా ఉన్నాయి. బీజేపీ -43,586, టీఆర్ఎస్ – 41,103, కాంగ్రెస్ – 14,158 ఓట్లతో ఉన్నాయి. అయితే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గణాంకాలు తగ్గుతుండటంతో .. ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Dubbaka By Poll ElectionsDubbaka Dangal ResultsDubbaka ResultsLatest Telangana NewsTelangana News Updates