‘డ్రాగన్ ఫేవరేట్’, ఆమిర్ ఖాన్ పై ఆర్ఎస్ఎస్ మండిపాటు

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల టర్కీలో ఫస్ట్ లేడీ ఎమైన్ ఎర్డోగాన్ తో భేటీ కావడంపై ఆర్ ఎస్ ఎస్ మండిపడింది. 'డ్రాగన్స్' ఫేవరేట్ ఖాన్' అంటూ నిప్పులు కక్కింది. ఇదే టైటిల్ తో తన పత్రిక 'పాంచజన్య' లో..

'డ్రాగన్  ఫేవరేట్', ఆమిర్ ఖాన్ పై ఆర్ఎస్ఎస్ మండిపాటు
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Aug 25, 2020 | 3:50 PM

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇటీవల టర్కీలో ఫస్ట్ లేడీ ఎమైన్ ఎర్డోగాన్ తో భేటీ కావడంపై ఆర్ ఎస్ ఎస్ మండిపడింది. ‘డ్రాగన్స్’ ఫేవరేట్ ఖాన్’ అంటూ నిప్పులు కక్కింది. ఇదే టైటిల్ తో తన పత్రిక ‘పాంచజన్య’ లో ఓ ఆర్టికల్ ని ప్రచురిస్తూ.. దేశ స్వాతంత్రోద్యమానికి ముందు. ఆ తరువాత కూడా బాలీవుడ్ సినిమాలు వచ్చాయని, కానీ మెల్లగా ఈ చిత్రాల్లోపాశ్చాత్య పోకడ ప్రభావం పెరిగిందని దుయ్యబట్టింది. టర్కీ ఫస్ట్ లేడీతో ఫోటోలు దిగడం ద్వారా ఆమిర్ ఆ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలనుకున్నాడని ఇందులో విమర్శించారు. ఆ దేశంలోనే ఈయన తన ‘లాల్ సింగ్ ఛాధ్ధా’ మూవీ షూటింగ్ ని ఎందుకు నిర్వహించాలనుకున్నాడని ఆర్ఎస్ఎస్ ప్రశ్నించింది. తనను సెక్యులర్ గా చెప్పుకునే ఈ నటుడు నిజస్వరూపం ఇదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే..గతంలో.. ఇండియాలో పరమత సహనం లేదని, తన భార్య భయపడుతోందని ఆయన చేసినవ్యాఖ్యలను గుర్తు చేసింది.

అటు- టర్కీలో ఆమిర్ గారి నిర్వాకంపై ఆ  మధ్య అనేకమంది నెటిజనులు కూడా ఆడిపోసుకున్నారు. అతనిది హిపోక్రసీ అని దుయ్యబట్టారు. తనను సినిమాల్లో దేశభక్తుడిగా చూపుకుంటూ మరోవైపు పాకిస్థాన్ తో అంటకాగుతున్న టర్కీతో చెట్టపట్టాలు వేసుకుంటున్నాడని వారు ధ్వజమెత్తారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu