కేజీహెచ్ వద్ద డాక్టర్ నమ్రత హై డ్రామా

మాతృత్వానికి నోచుకోని మహిళలకు వైద్యం అందించాల్సిన వైద్యురాలు పసికందులను విక్రయించడమే పనిగా పెట్టుకుంది. ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ముసుగులో కొన్నేళ్లుగా పసిపిల్లల్ని విక్రయిస్తోంది. గుట్టుగా సాగుతున్న ఈ రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితురాలు డాక్టర్‌ పచ్చిపాల నమ్రత పాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. డాక్టర్ నమ్రతను మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. నమ్రతకు ఆగస్టు 7 వరకు రిమాండ్ విదించారు. ఇందులో భాగంగా […]

కేజీహెచ్ వద్ద డాక్టర్ నమ్రత హై డ్రామా
Follow us

|

Updated on: Jul 28, 2020 | 6:45 AM

మాతృత్వానికి నోచుకోని మహిళలకు వైద్యం అందించాల్సిన వైద్యురాలు పసికందులను విక్రయించడమే పనిగా పెట్టుకుంది. ఒక ముఠాను ఏర్పాటు చేసుకొని యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ముసుగులో కొన్నేళ్లుగా పసిపిల్లల్ని విక్రయిస్తోంది. గుట్టుగా సాగుతున్న ఈ రాకెట్‌ను పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో కీలక సూత్రధారి, ప్రధాన నిందితురాలు డాక్టర్‌ పచ్చిపాల నమ్రత పాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

డాక్టర్ నమ్రతను మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. నమ్రతకు ఆగస్టు 7 వరకు రిమాండ్ విదించారు. ఇందులో భాగంగా డాక్టర్ నమ్రతను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలుకు తరలిస్తున్న సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఎ1 నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్ కుతీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అంతా నార్మల్ అని తేల్చారు. అయితే నమ్రత మాత్రం తనకు గుండె బరువెక్కిందంటు హడావిడి చేశారు.

వైద్యపరీక్షలన్నీ నార్మల్ రావడంతో తిరిగి వ్యాన్ ఎక్కేందుకు ససేమిరా అన్నారు. కేజీహెచ్ నుంచి తరలించినప్పుడూ డాక్టర్ నమ్రత వాగ్వాదానికి దిగారు. పోలీస్ వాహనం ఎక్కేందుకు ప్రతిఘటించారు. కేజీహెచ్ లోనే ఉంటానంటూ హడావుడి చేశారు. దీంతో మహిళా పోలీసులు బలవంతంగా జీపు ఎక్కించించారు పోలీసులు.