సోసల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. సీసీ కెమెరాలు, జంతుప్రేమికులు వాటిని వీడియోలు, ఫోటోలు తీసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేయటంతో విషయం నెటిజన్లకు చేరుతుంది. జంతువులు, పక్షులు, పాములు వంటి వాటి వీడియోలను నెటిజన్లు బాగానే ఆదరిస్తుంటారు. అలాంటి వీడియోల్లో కొన్ని వీక్షకులను షాక్ అయ్యేలా చేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్బాల్లో సింహాలు, పులులు వంటి అతి కృర జంతువులు కుక్కలు, అడవి పందులకు భయపడి పారిపోయిన ఘటనలు కూడా నెట్‌లో తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే, ఇక్కడ మాత్రం ఏపీలో జరిగిన ఓ షాకింగ్ ఇన్సిడెంట్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మాలేపల్లిలో ఈ అద్భత ఘటన జరిగింది. సాధారణంగా చిరుతను చూస్తే ఏ ఇతర జంతువులైనా భయంతో పారిపోతాయి. కానీ, ఇక్కడ మాత్రం గొర్రెల మందకు కాపలాగా ఉన్న కుక్కలు చిరుతపులిని భయపెట్టి ఉరికించాయి. కొన్ని రోజులుగా గొర్రెల మందపై దాడులు చేసి జీవాలను చంపుకుతింటున్న చిరుతను కుక్కలు ఉరికిచ్చి ఉరకిచ్చి తరిమేశాయి. కాపరుల సాయంతో ఈ కుక్కలు అటుగా వచ్చిన చిరుతపై తిరుగుటుకు దిగాయి..చిరుతను మూగజీవాల దరిదాపుల్లోకి రాకుండా వెంటపడి వెంటపడి తరిమేశాయి. కుక్కలు వెంటపడడంతో ఆ చిరుత బతుకు జీవుడా అన్నట్టుగా పరుగులు తీస్తూ అడవిలోకి పారిపోయింది. ఈ ఘటన ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా మారింది. నెట్‌లో కనిపించే వీడియోలే కాదు..ఇప్పుడు మన కళ్లముందే కనిపించిన ఈ సీన్ చూసి నెటిజన్లు కామెంట్లతో హెరెత్తిస్తున్నారు.