AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Loss: ఓహో జుట్టు రాలడానికి అసలు కారణం ఇదేనా?.. ఇన్ని రోజులు తెలీలేదే!

ఈ రోజుల్లో జనాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. మార్పులున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి లేదా కాలుష్యం కారణంగా జుట్టు రాలుతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ దీనికి ప్రోటీన్ లోపం కూడా ప్రధాన కారణమని కొంతమంది నమ్ముతున్నారు. వైద్యుల ప్రకారం ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.

Hair Loss: ఓహో జుట్టు రాలడానికి అసలు కారణం ఇదేనా?.. ఇన్ని రోజులు తెలీలేదే!
Hair Loss Causes
Anand T
|

Updated on: Aug 07, 2026 | 2:40 PM

Share

మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం జుట్టు సంరక్షణ ఉత్పత్తులపై మాత్రమే వాడితే సరిపోదు. మీకు జుట్టు రాలడం ఎక్కువయితే దాని ప్రధాన కారణం ఏమిటని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.అలా కాదని మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే.. చిన్న వయస్సులోనే మీకు బట్టతల రావచ్చు. కాబట్టి మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. వాటికి కావాల్సిన పోషకాలు, ప్రోటిన్‌ను అందించాల్సి ఉంటుంది. ఒక వేళ మీకు ప్రోటీన్ లోపం కారణంగా జుట్టు రాలుతూ ఉంటే.. దాన్ని ఎలా తగ్గించాలి, వైద్యులను ఎప్పుడు సంప్రదించాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రోటీన్ లోపం వల్ల జుట్టు రాలుతుందా?

హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. సాధారణంగా మన జుట్టు అనేది కెరాటిన్ అనే ప్రోటీన్ ద్వారా తయారవుతుంది. కాబట్టి దీనికి అవసరమైన మేర మనం ప్రోటీన్ అందించకపోతే జుట్టు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జుట్టు పెరగడం ఆగిపోవడంతో పాటు జుట్టు బలహీన పడి రాలిపోవడం కూడా స్టార్ట్ కావచ్చు.

అయితే కేవలం ఈ ప్రోటీన్ లోపం వల్ల మాత్రమే జుట్టు రాలుతోందా అంటే అవునని కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే.. మానసిక ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, ఐరన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, కొన్ని మందులు, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా జుట్టు రాలవచ్చు. కాబట్టి మీరు జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. దానికి నివారణ చర్యలను ప్రారంభించండి.

ప్రోటీన్ లోపం సంకేతాలు ఏమిటి?

మీకు ప్రోటీన్ లోపం ఉందా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే.. ప్రోటీన్ లోపం ఉన్న వ్యక్తుల్లో జుట్టు ఎక్కువగా రాలడం, కండరాల బలహీనత, అలసట, వాపు, గాయాలు నెమ్మదిగా మానడం, తరచుగా అనారోగ్యానికి గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందికి గోళ్లు పెళుసుగా మారడం లేదా చర్మం పొడిబారడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. అయితే, ఈ లక్షణాలు కేవలం ప్రోటీన్ లోపం వల్ల మాత్రమే వస్తాయని చెప్పలేము. కాబట్టి ఈ లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ప్రోటీన్ సమస్యను ఎలా అధిగమించాలి

ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి, పప్పులు, కిడ్నీ బీన్స్, శనగలు, సోయా చంక్స్, చీజ్, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్, నట్స్ , విత్తనాలు వంటి ఆహారాలను మీ ఆహారంలో చేర్చుకోండి. జుట్టు ,శరీర ఆరోగ్యానికి, ఇతర ముఖ్యమైన పోషకాలతో పాటు సమతుల్య ఆహారం చాలా అవసరం.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?

ఒక వేళ మీకు జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నా.. నెలలు, సంవత్సరాల తరబడి జుట్టు రాలడం ఆగకపోయినా.. తలపై ఖాళీలు ఏర్పడితే, జుట్టు రాలడం అకస్మాత్తుగా గణనీయంగా పెరిగితే, లేదా దానితో పాటు అలసట, బరువు తగ్గడం, నీరసం, లేదా ఇతర లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైతే, వైద్యుడు రక్త పరీక్ష లేదా ఇతర పరీక్షలు నిర్వహించడం ద్వారా ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోండి. ఇలా జుట్టు రాలే కారణాన్ని ముందుగా తెలుసుకుంటే.. బట్టతల రావడాన్ని అరికట్టవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us