కరోనా వచ్చిందంటే చాలు రక్త సంబంధీకులే అమడ దూరం పోతున్నారు. అయినవారే అలంత దూరం నుంచే పలకరిస్తున్నారు. కర్మకాలి జరగరానిదీ జరిగితే.. దరి చేరడమే కరువుతున్న ఈ రోజుల్లో కరోనా సోకిన ఓ వ్యక్తి ఓ డాక్టర్ డ్రైవర్ గా మారి ప్రాణాలను నిలబెట్టాడు. ఈ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. కరోనా సోకిన వృద్ధుడ్ని ఆస్పత్రికి చేర్చే క్రమంలో ఒక డాక్టర్ డ్రైవర్‌గా మారాల్సి వచ్చింది. పుణేలోని కరోనా సెంటర్‌లో 71 ఏళ్ల వృద్ధుడి కరోనా చికిత్స పొందుతున్నాడు. ఇదే క్రమంలో ఉన్నట్టుండి ఆ పెద్దాయన ఆక్సీజన్ లెవల్స్ పడిపోయాయి. దీంతో అతన్ని వేరే ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ అనారోగ్యంతో అందుబాటులో లేకుండా పోయాడు. అర్థరాత్రి సమయం కావడంతో ఇతర డ్రైవర్లు ఎవరు కనిపించకపోవడంతో అదే ఆస్పత్రికి చెందిన డాక్టర్ రంజీత్ నికమ్ అపద్బంధవుడయ్యాడు. తానే డ్రైవర్ గా మారి అంబులెన్స్ ను నడుపుకుంటూ వెళ్లాడు. వృద్ధుడి పెద్దాస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు.
‘ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటలకు జరిగింది. నేను కరోనా కేర్ సెంటర్‌లోనే ఉన్నా. ఒక పెద్దాయన ఆక్సీజన్ లెవల్ పడిపోయిందని నాకు కాల్ వచ్చింది. వెంటనే సీనియర్ డాక్డర్స్ సలహాలు తీసుకున్నా. సదరు పెద్దాయనను పెద్దాసుపత్రికి మార్చాలని నిర్ణయించాం.సెంటర్‌లో ఉన్న వ్యాన్ డ్రైవర్ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో 108ని పిలవడానికి యత్నించాం. కానీ కాల్ కలవలేదు. దీంతో నేనే బండి నడిపా. పెద్దాయనను ఆస్పత్రిలో చేర్పించాం. ఆయన ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది’ అని రంజీత్ పేర్కొన్నారు. డాక్టర్లు వైద్యంతో కాదు.. ప్రాణాపాయంలో ఉన్న వారికి డ్రైవర్ గా సేవలందించి ఫ్రంట్ వారియర్ డాక్టర్ రంజీత్ ను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు.
Exemplifying the spirit of a true ‘COVID warrior’, a 35-year-old doctor from the city did not hesitate to quickly switch roles from medical practitioner to ambulance driver on Monday night, after a 71-year-old COVID patient turned critical under his watchhttps://t.co/9tgrHyaYcl
— Pune Mirror (@ThePuneMirror) August 27, 2020