దిశ ఘటన: మృతదేహాలను భద్రపరచండి: హైకోర్టు

| Edited By: Srinu

Dec 13, 2019 | 6:43 PM

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు.. గత కొద్దిరోజులుగా.. తెలంగాణలో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం.. ఎన్‌కౌంటర్ మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు.. అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా హైకోర్టు.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ విచారణను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మానవ హక్కుల కమిషన్ మళ్లీ.. నిందితుల మృతదేహాలను […]

దిశ ఘటన: మృతదేహాలను భద్రపరచండి: హైకోర్టు
Follow us on

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు.. గత కొద్దిరోజులుగా.. తెలంగాణలో హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం.. ఎన్‌కౌంటర్ మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు.. అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్టులో దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా హైకోర్టు.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సుప్రీం కోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ విచారణను వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మానవ హక్కుల కమిషన్ మళ్లీ.. నిందితుల మృతదేహాలను రీపోస్ట్‌మార్టమ్‌కు అడగవచ్చని.. అప్పటివరకూ డెడ్ బాడీలను భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా.. చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరం మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. సుప్రీం ఆదేశాలతో మృతదేహాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి అధికారులు తరలించారు.