‘జీరో’ ఎఫ్ఐఆర్‌..ఇకపై ఆంధ్రాలో..డీజీపీ సంచలన ప్రకటన

ఏపీ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోనే విదివిధానాలు రూపొందించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీలు కసరత్తులు ప్రారంభించారు.  ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ విధానం ప్రస్తుతం ఢిల్లీ, ముంబై లాంటి రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ రూల్ ప్రకారం దగ్గర్లో ఉన్న ఏ […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:50 pm, Mon, 2 December 19
‘జీరో’ ఎఫ్ఐఆర్‌..ఇకపై ఆంధ్రాలో..డీజీపీ సంచలన ప్రకటన

ఏపీ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఏపీ వ్యాప్తంగా ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోనే విదివిధానాలు రూపొందించబోతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీలు కసరత్తులు ప్రారంభించారు.  ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ విధానం ప్రస్తుతం ఢిల్లీ, ముంబై లాంటి రాష్ట్రాల్లో అమలులో ఉంది. ఈ రూల్ ప్రకారం దగ్గర్లో ఉన్న ఏ స్టేషన్లోనైనా కంప్లైంట్ ఫైల్ చెయ్యెచ్చు. దానిపై తక్షణ విచారణ జరిపిన అనంతరం, ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు  కేసు బదిలీ చెయ్యాల్సి ఉంటుంది.

దిశపై దారుణ హత్యాచారం ఘటనలో పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. తమ పరిధిలోకి రాదంటూ పలు పోలీస్ స్టేషన్లకు తమను తిప్పారంటూ దిశ తల్లిదండ్రులు వాపోయిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్గత విచారణ చేసిన పోలీసు శాఖ అందుకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసింది. దీంతో ఏపీలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దిశ ఘటనతో తీవ్ర కలత చెందిన  సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడంతో, డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు అధికారులను సమన్వయం చేస్తున్నారు.