ఆవేశం, బాధ..నాకూ ఇద్దరు ఆడబిడ్డలున్నారు : పవన్ భావోద్వేగం

దిశపై హత్యాచారం ఘటనపై పవన్ తీవ్ర భావోద్వేగానికి గురమ్యారు. దిశ..ఆమె సోదరితో మాట్లాడిన సంభాషణ తన హృదయాన్ని ద్రవింపజేసిందని పవన్ పేర్కొన్నారు. ఇలాంటి ఆటవిక సమాజంలోనా మనం బ్రతుకుతోంది అన్న పనవ్…తాను కూడా ఇద్దరు ఆడపిల్లలు తండ్రినని ఆవేదన వ్యక్తం చేశారు. సమూహంలోనే ఉన్నాం అనుకుంటున్నాం కానీ, రద్దీగా ఉండే రోడ్డులో ఉన్మాదులు చేసిన దాష్టీకాన్ని చూస్తూంటే..అందరం ఒంటరిగానే బ్రతుకుతున్నాం అని పేర్కొన్నారు. నలుగురు మృగాళ్లలో ఒక్కరిలో కూడా భయం, భక్తి కనిపించలేదన్న పవన్..ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలంటూ […]

ఆవేశం, బాధ..నాకూ ఇద్దరు ఆడబిడ్డలున్నారు : పవన్ భావోద్వేగం
Follow us

|

Updated on: Dec 02, 2019 | 7:50 PM

దిశపై హత్యాచారం ఘటనపై పవన్ తీవ్ర భావోద్వేగానికి గురమ్యారు. దిశ..ఆమె సోదరితో మాట్లాడిన సంభాషణ తన హృదయాన్ని ద్రవింపజేసిందని పవన్ పేర్కొన్నారు. ఇలాంటి ఆటవిక సమాజంలోనా మనం బ్రతుకుతోంది అన్న పనవ్…తాను కూడా ఇద్దరు ఆడపిల్లలు తండ్రినని ఆవేదన వ్యక్తం చేశారు. సమూహంలోనే ఉన్నాం అనుకుంటున్నాం కానీ, రద్దీగా ఉండే రోడ్డులో ఉన్మాదులు చేసిన దాష్టీకాన్ని చూస్తూంటే..అందరం ఒంటరిగానే బ్రతుకుతున్నాం అని పేర్కొన్నారు.

నలుగురు మృగాళ్లలో ఒక్కరిలో కూడా భయం, భక్తి కనిపించలేదన్న పవన్..ఆడపిల్లలను ఎలా కాపాడుకోవాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. తాను కూడా అక్కాచెల్లెళ్లతో పెరిగిన వాడినేనని.. ఆ భయం, బాధ్యతలు తనకు తెలుసని పేర్కొన్నారు. గడపదాటి వెళ్లిన ఆడపిల్ల మళ్లీ ఇంటికి వచ్చేవరకు తల్లీదండ్రులు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని పవన్ అన్నారు.  సింగపూర్ తరహా శిక్షలు మన దగ్గర కూడా అమలులోకి రావాలని, తోలు ఊడేలా కర్ర పట్టుకోని నడిరోడ్డుపై..ప్రజలందరూ చూస్తుండగానే నేరస్థులను శిక్షించాలని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఘటనలు జరిగాక మాట్లాడుకునేకంటే, అటువంటి ఆలోచనలు మైండ్‌లోకి రావాలంటేనే భయపడేలా చర్యలు ఉండాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఏపీలో మహిళల భద్రత పట్ల కూడా పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.