పెట్రోల్ ధరను దాటేసిన డీజిల్.. 18 రోజుల్లో రూ.10 పెంపు..

దేశంలో వరుసగా 18వ రోజు డీజిల్ ధరలు పెరిగాయి. గత 17 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చిన చమురు కంపెనీలు ఈసారి పెట్రోల్ ధరల జోలికి వెళ్లకుండా డీజిల్ రేట్లను పెంచాయి.

పెట్రోల్ ధరను దాటేసిన డీజిల్.. 18 రోజుల్లో రూ.10 పెంపు..

Updated on: Jun 24, 2020 | 11:58 AM

దేశంలో వరుసగా 18వ రోజు డీజిల్ ధరలు పెరిగాయి. గత 17 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చిన చమురు కంపెనీలు ఈసారి పెట్రోల్ ధరల జోలికి వెళ్లకుండా డీజిల్ రేట్లను పెంచాయి. లీటర్ డీజిల్ ధర‌ 55 పైసలు ఎగిసింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.79.76 ఉండగా, డీజిల్ ధర రూ. 79.88కు చేరింది. అంతేకాకుండా దేశంలో పెట్రోల్ రేటును డీజిల్ ధర దాటేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, గత 18 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 8.50, రూ. 10. 48 చొప్పున పెరిగాయి.

మెట్రో నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి…

  • ఢిల్లీ – పెట్రోల్ రూ. 79.76, డీజిల్ రూ. 79.88
  • కోల్‌కతా – పెట్రోల్ రూ. 81.45, డీజిల్ రూ. 75.06
  • ముంబై – పెట్రోల్ రూ. 86.54, డీజిల్ రూ. 78.22
  • చెన్నై – పెట్రోల్ రూ. 83.04, డీజిల్ రూ. 77.17