రెండు కాదు మూడుసార్లు వైమానిక దాడులు చేశాం.. రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Mar 09, 2019 | 6:43 PM

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడులపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల కాలంలో భారత దళాలు మూడు సార్లు సరిహద్దులు దాటి విదేశీ భూభాగంలోకి ప్రవేశించాయనీ… విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించాయని పేర్కొన్నారు. అయితే తాను మొదటి రెండు ఘటనల గురించే మాట్లాడతాననీ.. మూడోదాని గురించి మాట్లాడబోనని పేర్కొన్నారు. కర్నాటకలో ఇవాళ జరిగిన ఓ ర్యాలీలో హోంమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ… గత ఐదేళ్లలో, మనం మూడు […]

రెండు కాదు మూడుసార్లు వైమానిక దాడులు చేశాం.. రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
Follow us on

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడులపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల కాలంలో భారత దళాలు మూడు సార్లు సరిహద్దులు దాటి విదేశీ భూభాగంలోకి ప్రవేశించాయనీ… విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించాయని పేర్కొన్నారు. అయితే తాను మొదటి రెండు ఘటనల గురించే మాట్లాడతాననీ.. మూడోదాని గురించి మాట్లాడబోనని పేర్కొన్నారు. కర్నాటకలో ఇవాళ జరిగిన ఓ ర్యాలీలో హోంమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ… గత ఐదేళ్లలో, మనం మూడు సార్లు సరిహద్దు దాటి వెళ్లాం. మనవాళ్లు విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించారు. అందులో రెండు సంఘటనలపై నేను చెబుతాను. మూడోదానిపై మాట్లాడను అని పేర్కొన్నారు. అంతలోనే 2016 జరిగిన సర్జికల్ దాడులు, ఇటీవల పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై జరిగిన వైమానిక దాడులపైకి ఆయన సభికుల దృష్టి మళ్లించారు. కాగా మూడో వైమానిక దాడి గురించి తాను మాట్లాడబోనంటూ రాజ్‌నాథ్ చెప్పినప్పుడు సభలో నవ్వులు పూయగా… కార్యకర్తలంతా కరతాళ ధ్వనులు చేయడం విశేషం. అయితే సెప్టెంబర్ 2018 లో ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫరాబాద్ లో జరిగిన సభలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.